News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!

మిల్కీ బ్యూటీ తమన్నాతాజాగా 'జి కర్దా' అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య సినిమాలకన్నా ఎక్కువగా వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సౌత్ భాషల్లో నటించిన పలు వెబ్ సిరీస్ లు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ఆడియన్స్ ని అలరించబోతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో 'జీ కర్దా' (Jee Karda)అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఇక ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ను తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. లవ్ అండ్ ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ జూన్ 15 న విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మీడియాలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. తమన్నా తో పాటు ఆసీష్ గులాటి, అన్యాసింగ్, సోహెల్ నయ్యర్, నయన్ బెనర్జీ, హుస్సేన్ దలాల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏడుగురు బాల్య స్నేహితుల జీవితాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగనుంది.

30 ఏళ్ల వయసులోపు జీవితంలో సెటిల్ కావాలని కలలు కన్న క్లోజ్ ఫ్రెండ్స్ తమ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు తిరిగాయి? వాళ్లు చేసిన తప్పు వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు? అనేది ఈ సిరీస్ మెయిన్ ప్లాట్. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా మెయిన్ లీడ్ గా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతోంది. తమన్నా కంప్లీట్ హిందీలో నటిస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ ఇదే. ఇప్పటికే తెలుగులో '11th అవర్', అలాగే తమిళంలో 'నవంబర్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ లలో నటించింది తమన్నా. ఈ రెండు వెబ్ సిరీస్ లు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక తాజాగా హిందీలో నటించిన 'జీ కర్దా' వెబ్ సిరీస్ తమన్న కి ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం తమన్నా ఇటు వెబ్ సిరీస్ లతోపాటు అగ్ర హీరోల సరసన సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'భోలా శంకర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తమిళంలో వచ్చిన 'వేదాళం' అనే సినిమాకి రీమేక్ గా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి, తమన్నాలపై ఓ సాంగ్ ని చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓవైపు షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. తాజాగా 'బోలా శంకర్' మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో విడుదలైన విషయం తెలిసింది. బోలా మేనియా అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని జూన్ 4న రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు తమిళంలోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'జైలర్' మూవీలో నటిస్తోంది తమన్నా. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తిచేసుకుంది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను సైతం మొదలుపెట్టబోతున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని ఆగస్టు 10న విడుదల చేయబోతున్నారు.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియన్ సెల్వన్ 2' - ఇక నుంచి ఫ్రీగా చూడొచ్చు!

Published at : 02 Jun 2023 09:43 PM (IST) Tags: Acctress Tamannaah Tamannaah New Movie Jee karda Jee Karda Movie

ఇవి కూడా చూడండి

Tiger Nageswara Rao: 'వీడు' లిరికల్ సాంగ్ వీడియో - ఒక్క మాస్ పాటతో 'టైగర్ నాగేశ్వరరావు' పాత్ర‌ను చెప్పేశారు!

Tiger Nageswara Rao: 'వీడు' లిరికల్ సాంగ్ వీడియో - ఒక్క మాస్ పాటతో 'టైగర్ నాగేశ్వరరావు' పాత్ర‌ను చెప్పేశారు!

నా కూతురితో పాటూ నేను చనిపోయా - కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ట్వీట్!

నా కూతురితో పాటూ నేను చనిపోయా - కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ట్వీట్!

మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?

మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్

New Parliament: కొత్త పార్లమెంట్‌ వద్ద తమన్నా, మంచు లక్ష్మీ, దివ్యా దత్తా - మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏమన్నారంటే?

New Parliament: కొత్త పార్లమెంట్‌ వద్ద తమన్నా, మంచు లక్ష్మీ, దివ్యా దత్తా - మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏమన్నారంటే?

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?