అన్వేషించండి

Swayambhu Teaser: స్వయంభూ టీజర్ వచ్చేసిందోచ్... 'బాహుబలి' రేంజ్‌లో నిఖిల్ సినిమా - వీడియో చూశారా?

Swayambhu Teaser Review: నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న 'స్వయంభూ' టీజర్ విడుదలైంది. భారీ పాన్ ఇండియా స్థాయి సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో 'బాహుబలి' తరహాలో ఉంది.

ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు అందించాలని తాపత్రయపడే కథానాయకులలో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. ప్రతి సినిమాకు వ్యత్యాసం చూపించాలని, ఇప్పటి వరకు ప్రేక్షకులు తెరపై చూడని కొత్త కథ, సినిమా చూపించాలని ఆయన ప్రయత్నిస్తారు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా విజయం అందుకున్న ఆయన... ఇప్పుడు మైథాలజీ టచ్ ఉన్న ఓ భారీ ద్వారా డ్రామా చేస్తున్నారు. ఆ చిత్రమే 'స్వయంభూ'. ఇన్నాళ్ళూ ఫస్ట్ లుక్స్ మాత్రమే విడుదల చేశారు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.

'బాహుబలి' స్థాయిలో 'స్వయంభూ'
నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా భరత్ కృష్ణాచారి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'స్వయంభూ'. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకం మీద భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఇవాళ విడుదలైన టీజర్ చూస్తే... 

'సాక్షాతూ ఆ సదాశివుడే దిగివచ్చి శ్రీరాముడికి అందించిన ఈ సెంగోలికి కూడా అరణ్య వాసమా?' అని అయ్యప్ప శర్మ చెప్పిన మాటతో 'స్వయంభూ' టీజర్ మొదలైంది. తర్వాత శరత్ కుమార్ సహా పలువురు పాత్రలను పరిచయం చేయారు. రాజ్యంలో అంతర్యుద్ధం మొదలైందని పేర్కొన్నారు. విజువల్స్, 'కేజీఎఫ్' & 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం వార్ డ్రామా ఫీల్ తీసుకు వచ్చాయి. 

'ఇంత పెద్ద రాజ్యాన్ని చేజిక్కుంచుకున్నాం కానీ ఆ సెంగోలి వల్ల ఇంకెంత కాలం వీళ్ళ నోళ్లను కత్తులతో మూయించాలి' అని విలన్ చెప్పే డైలాగ్ చూస్తుంటే... ఈ కథలో సెంగోలి పాత్ర కీలకం కానుందని అర్థం అవుతోంది. ఆ తర్వాత 'కాలం కత్తై దూస్తే... కాపాడే కవచం ఒకటి కావాలి కదా' అని డైలాగ్ వచ్చిన తర్వాత నిఖిల్ పాత్రను పరిచయం చేశారు. 'బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా కానీ తెగింపు ఎంత దూరమైనా వెళుతుంది' అని నిఖిల్ చెప్పారు.

Also ReadTheatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు

యుద్ధ నీతి కాదు... నిజం!
'ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా యుద్ధం నిలవదు కృష్ణా! అదే యుద్ధ నీతి' అని నటుడు సుబ్బరాజు డైలాగ్ చెబితే... 'ఒక వ్యక్తే కదా అని వదులుకుంటే, ఆ ఇంటిని - ఒక ఇల్లే కదా అని వదులుకుంటే ఆ గ్రామాన్ని - ఒక గ్రామమే కదా అని వదులుకుంటే ఆ రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇది నీతి కాదు... నిజం' అని నిఖిల్ సిద్ధార్థ బదులు ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్సులు అన్నీ బావున్నాయి. వేసవిలో ఈ సినిమా విడుదల కానుందని చిత్ర బృందం తెలిపింది.

Also ReadWith Love Box Office Collection: పది కోట్ల క్లబ్బులో 'విత్ లవ్'... బాక్స్ ఆఫీస్‌లో పెద్ద హిట్ కొట్టిన చిన్న సినిమా

'స్వయంభూ' సినిమాలో నభా నటేష్, సంయుక్త హీరోయిన్లు. టీజర్‌లో వాళ్ళిద్దరి పాత్రలూ పరిచయం చేశారు. సంయుక్త ఫెరోషియస్ పాత్రలో కనిపిస్తే... రాకుమారి తరహాలో నభా నటేష్ కనిపించారు. పాన్ ఇండియా కాదు... తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి విజయ్ కామిశెట్టి మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు.

Also Read: ఓటీటీలోకి వచ్చిన 375 కోట్ల సినిమా... స్ట్రీమింగ్ ఎందులో, ఎన్ని భాషల్లోనో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dhandoraa Awards : 'దండోరా'కు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు - తెలుగు వారి ప్రతిభ చాటే చిత్రం... గద్దర్ అవార్డ్స్‌పై మూవీ టీం హర్షం
'దండోరా'కు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు - తెలుగు వారి ప్రతిభ చాటే చిత్రం... గద్దర్ అవార్డ్స్‌పై మూవీ టీం హర్షం
Kamal Haasan Remuneration : 'కల్కి 2898AD' కోసం కమల్ హాసన్ రెమ్యునరేషన్ - 10 రోజులకు ఎంత తీసుకున్నారో తెలుసా?
'కల్కి 2898AD' కోసం కమల్ హాసన్ రెమ్యునరేషన్ - 10 రోజులకు ఎంత తీసుకున్నారో తెలుసా?
Bellamkonda Sreenivas Engagement : ప్రియురాలితో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ - వీడియో వైరల్
ప్రియురాలితో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ - వీడియో వైరల్
Rakasa Rapappa Song : ట్రెండింగ్‌లో రాకాస రపప్పా రపప్పా సాంగ్ - కనెక్ట్ అయ్యే లవ్ బ్రేకప్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రాకాస రపప్పా రపప్పా సాంగ్ - కనెక్ట్ అయ్యే లవ్ బ్రేకప్ లిరిక్స్
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs New zealand Final Toss: ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
Team India Playing 11: ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Embed widget