అన్వేషించండి

Theatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు

Theatrical Releases This Week Telugu: ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం. ఆ రోజుకు ముందు, ఆ రోజు... వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ వారంలో థియేటర్లలోకి వచ్చే తెలుగు సినిమాలు ఏవో చూడండి.

వాలెంటైన్స్ వీక్ సందడి మొదలైంది. ప్రేమికుల దినోత్సవానికి ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆరెంజ్' రీ రిలీజ్ అయ్యింది. ఈ వారం మరో రెండు ప్రేమకథా చిత్రాలు మళ్ళీ థియేటర్లలోకి సందడి చేయడానికి రెడీ అయ్యాయి. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు... థియేటర్లలోకి రాబోయే కొత్త తెలుగు సినిమాలు ఏమిటి? రీ రిలీజ్ కాబోయే ఫిలిమ్స్ ఏమిటి? హిందీ సినిమాలు ఏం ఉన్నాయి? అనేది తెలుసుకోండి. 

నాగ చైతన్య 'లవ్ స్టోరీ'తో పాటు 'మనసంతా నువ్వే'
Naga Chaitanya Love Story Re Release 2026: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమా 'లవ్ స్టోరీ'. ఇందులో సాయి పల్లవి కథానాయిక. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన 'మనసంతా నువ్వే' కూడా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ అవుతోంది.

విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ తీసిన నవ్వుల 'ఫంకీ'
Funky Movie Release Date: సంక్రాంతికి విడుదలైన 'అనగనగా ఒక రాజు'తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎస్ నాగవంశీ మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు. ఆ సినిమా వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. నెల తిరక్కుండా మరో సినిమాతో వస్తున్నారు నాగవంశీ. విశ్వక్ సేన్ హీరోగా ఆయన నిర్మించిన సినిమా 'ఫంకీ'. సాయి సౌజన్య మరో నిర్మాత. 'జాతి రత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహించిన చిత్రమిది. కయాదు లోహర్ హీరోయిన్. ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రానుందీ సినిమా. ట్రైలర్ నవ్వించింది. ఈ సినిమా కూడా అలాగే నవ్విస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

Also Read: ఓటీటీ లవర్స్‌కు అదిరిపోద్దీ వారం... బ్లాక్‌బస్టర్ హిట్స్ & ఒరిజినల్ ఫిలిమ్స్... ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు, ఈ వారం సందడి చేసే సినిమాలు & వెబ్ సిరీస్‌ల లిస్ట్

తెలుగు, తమిళ భాషల్లో రొమాంటిక్ 'కపుల్ ఫ్రెండ్లీ'
యువ కథానాయకుడు సంగీత్ శోభన్ నటించిన తాజా సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ చిత్రంలో మానసా వారణాసి కథానాయిక. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14న విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్, పాటలు యువతను ఆకట్టుకున్నాయి.

Also ReadAyesha Khan: పీరియడ్స్‌లో 'ధురంధర్' సాంగ్ షూట్... 'షరారత్' చేసేటప్పుడు ఏడ్చిన ఆయేషా ఖాన్

అర్జున్ దర్శకత్వంలో అమ్మాయి 'సీతా పయనం'
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాలో కథానాయకుడితో పాటు దర్శకుడు ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'సీతా పయనం'. ఇందులో ఆయన కుమార్తె ఐశ్వర్య కథానాయిక. నిరంజన్ కథానాయకుడు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో అర్జున్, ఆయన మేనల్లుడు ధృవ్ సర్జా కీలక పాత్రలు చేశారు.

Also ReadGovinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

తెలుగులోకి మలయాళ హిట్ 'చథా పచ్చ'!
సౌబిన్ షాహిర్ 'రోమాంచం', మమ్ముట్టి 'భ్రమ యుగం'తో మన తెలుగు ప్రేక్షకులు కొందరికి తెలిసిన నటుడు అర్జున్ అశోకన్. ఆయన ఓ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా 'చథా పచ్చ'. రోషన్ మాథ్యూ, లక్ష్మీ మీనన్, విషాక్ నాయర్, సాయి కుమార్, సిద్ధిఖీ ఇతర ప్రధాన తారాగణం. జనవరి 22న మలయాళంలో విడుదలైంది. తెలుగులో ఫిబ్రవరి 13న విడుదల చేస్తున్నారు.

Also ReadBarabar Premistha Controversy: బూతు పాటపై విమర్శలు... వెనక్కి తగ్గని యాటిట్యూడ్ స్టార్... అసలు ఏంటీ బరాబర్ కాంట్రవర్సీ?

హిందీలో షాహిద్ కపూర్ 'ఓ రోమియో' రిలీజ్!
Shahid Kapoor O Romeo Release Date: హిందీ సినిమాల కోసం చూసే తెలుగు ప్రేక్షకులకు ఈ వారం షాహిద్ కపూర్ 'ఓ రోమియో' ఉంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో 'యానిమల్', 'స్పిరిట్' ఫేమ్ తృప్తి డిమ్రి హీరోయిన్. నానా పటేకర్, తమన్నా భాటియా, దిశా పటానీ సైతం నటించారు. ఫిబ్రవరి 13న ఈ సినిమా విడుదల. 

ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాణంలో ఆదర్శ్ గౌరవ్, షనాయా కపూర్ జంటగా నటించిన సినిమా 'తూ యా మై'. బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వస్తోంది.

Also ReadParasakthi Review Telugu - పరాశక్తి రివ్యూ: జీ5 ఓటీటీలో శివకార్తికేయన్ సినిమా... తెలుగు ప్రేక్షకులకు ఈ తమిళ సినిమా నచ్చుతుందా?

  • శివ కంఠమనేని, ఎస్తేర్, ధన్యా బాలకృష్ణ, బండారు సుప్రీతా నాయుడు ప్రధాన పాత్రల్లో రూపొందిన హారర్ థ్రిల్లర్ 'అమరావతికి ఆహ్వానం' చిత్రాన్ని ఫిబ్రవరి 13న విడుదల చేస్తున్నారు.
  • త్రిగుణ్ అలియాస్ అరుణ్ అదిత్ హీరోగా నటించిన తమిళ్ సినిమా 'స్వీటీ నాటీ క్రేజీ'. ఇదొక అడల్ట్ కామెడీ. తెలుగులోనూ డబ్బింగ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 13న రిలీజ్.
  • మేనల్లుడు అజయ్ దిషాన్ హీరోగా విజయ్ ఆంటోనీ నిర్మించిన తమిళ సినిమా 'పూకీ'. ఫిబ్రవరి 13న విడుదల. తెలుగులో టైటిల్ మీద విమర్శలు రావడంతో 'బూకీ' అని మార్చారు. మరి, 13నే తెలుగులోనూ విడుదల చేస్తారా? లేదంటే వారం ఆగుతారా? అనేది చూడాలి. ప్రస్తుతానికి పబ్లిసిటీ అయితే నిల్.
  • మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'నిలవే' చిత్రాన్ని సైతం ఫిబ్రవరి 13న విడుదల చేస్తున్నారు. పాటలతో పాటు 'అర్జున్ రెడ్డి' తరహాలో సన్నివేశాలు ఉన్నాయని పేరు వచ్చింది. ట్రైలర్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే... 'వన్ ప్లస్ వన్ ఆఫర్', 'స్కై' సైతం ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రానున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh : మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ సారీ - 'తథాస్తు' ట్వీట్‌పై క్లారిటీ
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ సారీ - 'తథాస్తు' ట్వీట్‌పై క్లారిటీ
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Lockdown OTT : ఓటీటీలోకి అనుపమ సర్వైవల్ థ్రిల్లర్ 'లాక్ డౌన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి అనుపమ సర్వైవల్ థ్రిల్లర్ 'లాక్ డౌన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్
Manchu Manoj : రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రాకింగ్ లుక్ - న్యూ అవతార్ కోసం ఏం చేశారంటే?
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రాకింగ్ లుక్ - న్యూ అవతార్ కోసం ఏం చేశారంటే?
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Sandigdham: విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Hyundai Verna 2026 వెర్షన్ వచ్చేసింది - కొత్త డిజైన్, అదనపు సేఫ్టీ ఫీచర్లు
2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Embed widget