MSVPG OTT Streaming: ఓటీటీలోకి వచ్చిన 375 కోట్ల సినిమా... చిరంజీవి సినిమా స్ట్రీమింగ్ ఎందులో, ఎన్ని భాషల్లోనో తెలుసా?
Mana Shankara Vara Prasad Garu OTT Streaming: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'మన శంకర వరప్రసాద్ గారు' ఓటీటీలోకి వచ్చింది.

Mana Shankara Vara Prasad Garu OTT Release Streaming Platform: బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' భారీ విజయం సాధించింది. టికెట్ కౌంటర్స్ దగ్గర ఈ సినిమా 375 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది? ఏ ఓటీటీలో సినిమా చూడాలి? వంటి వివరాల్లోకి వెళితే...
జీ5 ఓటీటీలోకి వచ్చిన వరప్రసాద్ గారు
MSVPG Streaming On Zee5: 'మన శంకర వరప్రసాద్ గారు' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాన్ని థియేటర్లలో తెలుగు భాషలో మాత్రమే విడుదల చేశారు. అయితే... ఓటీటీకి వచ్చేసరికి మరో ఆరు భాషల్లో డబ్బింగ్ చేశారు. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలను దక్షిణాది నాలుగు భాషలతో పాటు హిందీలో విడుదల చేయడం చూస్తున్నాం. అయితే... ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో వీక్షకుల కోసం అందుబాటులోకి తీసుకు వచ్చారు.
View this post on Instagram
ఓటీటీలోకి వస్తుందని తెలిసీ థియేటర్లకు జనాలు!
ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఓటీటీలోకి 'మన శంకర వరప్రసాద్ గారు' స్ట్రీమింగ్‌కు వస్తుందని తెలుసు. అయినా సినిమా చూసేందుకు థియేటర్లకు జనాలు వచ్చారు. సోమవారం ఈ సినిమాకు 30 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చింది. ఆదివారం కోటి కలెక్ట్ చేసింది. చిరంజీవి సినిమా కోసం థియేటర్లకు జనాలు వస్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
View this post on Instagram
'మన శంకర వరప్రసాద్ గారు'లో చిరంజీవి సరసన నయనతార నటించగా... విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్రలో నటించారు. సినిమాలో చిరంజీవి - నయనతార మధ్య సన్నివేశాలకు ఎంత మంచి స్పందన లభించిందో... చిరంజీవి - వెంకటేష్ మధ్య సన్నివేశాలకు అంతకు మించి స్పందన లభించింది. కేథరిన్, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, జరీనా వాహేబ్ తదితరులు సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు.



















