Nikhil Siddhartha Birthday: నిఖిల్ బర్త్‌డే స్పెషల్ - ‘స్వయంభు’లో కొత్త లుక్ చూశారా?
Swayambhu Movie: నిఖిల్ సిద్ధార్థ్ బర్త్ డే సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ ‘స్వయంభు’ నుండి కొత్త పోస్టర్ విడుదలయ్యింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకేదైనా అప్డేట్ వస్తుందేమో అని ఆశించి డిసప్పాయింట్ అయ్యారు.
Swayambhu Movie Update: ఈ రోజుల్లో పీరియాడిక్ డ్రామాలు, వార్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువ సక్సెస్‌ను తెచ్చిపెడుతున్నాయని మేకర్స్ ఫీలవుతున్నారు. వారు అనుకున్నట్టుగానే గత కొన్నేళ్లలో ఇలాంటి సినిమాలు రికార్డులను తిరగరాశాయి. అందుకే ఇలాంటి చిత్రాలపై ఎంత ఖర్చు అయినా పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. అలా యంగ్ హీరో నిఖిల్ కూడా ఇదే సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ‘స్వయంభు’ అనే పీరియాడిక్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జూన్ 1న తన పుట్టినరోజు సందర్భంగా ‘స్వయంభు’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు ఈ యంగ్ హీరో.
కొత్త పోస్టర్..
నిఖిల్ చివరిగా ‘స్పై’ అనే చిత్రంలో కనిపించాడు. అది విడులదయినప్పటి నుంచి ‘స్వయంభు’ కోసమే కష్టపడుతున్నాడు. ఈ పీరియాడిక్ చిత్రంలో ఒక యోధుడిగా కనిపించనున్నాడు నిఖిల్. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు నిర్మాతలు భువన్, శ్రీకర్. ఇప్పటికే ‘స్వయంభు’కు సంబంధించిన అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు నిఖిల్. ఈ సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ ఎలా జరుగుతుందో చెప్తూ పలు వీడియోలు కూడా షేర్ చేశాడు. ఇక జూన్ 1న తన బర్త్ డే కావడంతో ‘స్వయంభు’ నుంచి మరో కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేశాడు నిఖిల్.
అద్భుతమైన అనుభవం..
‘‘స్వయంభు.. టీమ్ అందించిన బర్త్ డే విషెస్‌కు చాలా థ్యాంక్స్. ప్రతీరోజు ఈ సినిమా కోసం షూట్ చేయడం అనేది ఒక అద్భుతమైన అనుభవం. మేము ఏం సిద్ధం చేస్తున్నామో మీకు చూపించడానికి ఎదురుచూస్తున్నాం’’ అంటూ ‘స్వయంభు’ నుంచి మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశాడు నిఖిల్. ఈ పోస్టర్‌లో తన రెండు చేతుల్లో కత్తి పట్టుకొని యోధుడిగా కనిపిస్తున్నాడు. తన చుట్టూ యుద్ధం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. అంటే ఈ పోస్టర్.. ‘స్వయంభు’లోని ఫైట్ సీన్‌కు సంబంధించిన అయ్యిండవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మరేదైనా అప్డేట్ వస్తుందేమో అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.
View this post on Instagram
బాలీవుడ్‌పై ఫోకస్..
ఇప్పటికే ‘కార్తికేయ 2’ లాంటి మూవీతో నార్త్‌లో తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకున్నాడు నిఖిల్. అదే దృష్టిలో పెట్టుకొని ‘స్వయంభు’ను కూడా హిందీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తెలుగు, హిందీలో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళంలో కూడా ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్‌తో పాటు నభా నటేశ్ హీరోయిన్లుగా నటింస్తున్నారు. ‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ నటించిన మూవీ హిందీలో విడుదల అవుతుండడంతో ‘స్వయంభు’ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ లాంటి చిత్రాలకు కెమెరామ్యాన్‌గా పనిచేసిన సెంథిల్ కుమార్.. ‘స్వయంభు’ టీమ్‌లో చేరారు.
Also Read: రాసి పెట్టుకోండి బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం- ఆ సినిమాతోనే కాంపిటీషన్ అంటున్న శర్వానంద్