Retro Telugu Teaser: 'నో వయలెన్స్, ఓన్లీ లవ్' - ఆసక్తికరంగా సూర్య 'రెట్రో' తెలుగు టీజర్, సినిమా విడుదల ఎప్పుడంటే?
Surya Retro: తమిళ స్టార్ హీరో సూర్య, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన 'రెట్రో' తెలుగు టీజర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Surya Retro Telugu Teaser Out: తమిళ స్టార్ హీరో సూర్య (Surya), ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తోన్న మూవీ 'రెట్రో' (Retro). పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు టీజర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. మలయాళ నటుడు జోజు జార్జ్, కరుణకరణ్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటుడు సూర్య సొంత నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్‌టైన్మెంట్స్' బ్యానర్‌పై తన భార్య జ్యోతికతో కలిసి స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. తాజాగా సినిమా విడుదల తేదీని సైతం మూవీ టీం ప్రకటించింది. సమ్మర్ కానుకగా మే 1వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా, గత మూడేళ్లుగా సూర్య 'కంగువ' కోసం పనిచేశారు. ఈ సినిమా ఆశించినంత ఫలితం రాబట్టలేకపోయినందున 'రెట్రో'తో హిట్ కొట్టాలని భావిస్తున్నారు.
'రెట్రో' టీజర్ ఎలా ఉందంటే.?
ఇప్పటికే 'రెట్రో' తమిళ టీజర్ విడుదల కాగా తాజాగా తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్‌గ్రౌండ్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. 'గ్యాంగ్ స్టర్‌గా మారిన హీరో తన ప్రేయసి కోసం ఎలా మారాడు.?' అనేదే ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. యాక్షన్, డ్రామా, లవ్, వయలెన్స్ ఇలా అన్నీ మేళవింపుల సమాహారంగా చిత్రం ఉండబోతోందని టీజర్ చెప్పకనే చెబుతోంది. గ్యాంగ్ స్టర్ అయిన హీరో హింస మార్గం నుంచి బయటపడి కొత్త జీవితం ప్రారంభిస్తానని.. చెప్పే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు 'దసరా' సినిమాకు సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
#Retro Title Teaser streaming now in Hindi and Telugu
— karthik subbaraj (@karthiksubbaraj) February 8, 2025
Tamil ▶️https://t.co/jwxB7zHyNJ
Hindi ▶️https://t.co/maTW3jva9V
Telugu ▶️https://t.co/U6QHdUDVLm#RetroFromMay1#LoveLaughterWar pic.twitter.com/CfsNPpsLRD






















