అన్వేషించండి

ఓటీటీలో అదరగొడుతున్న గోపిచంద్ డిజాస్టర్ మూవీ - నెట్ ఫ్లిక్స్ టాప్-1 ట్రెండింగ్ లో రామబాణం!

గోపీచంద్ నటించిన 'రామబాణం' మూవీ ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ గా దూసుకుపోతోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ టాప్-1 ట్రెండింగ్ లో నిలిచింది.

యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటించిన 'రామబాణం' ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. చాలా ఆలస్యంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కి తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ వన్ లో దూసుకుపోతుంది. రీసెంట్ టైమ్స్ లో థియేటర్స్ లో లాంగ్ రన్ కంటిన్యూ చేయలేకపోయిన 'రామబాణం', 'ఏజెంట్' ఓటీటీ  రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. వీటిల్లో 'ఏజెంట్' ఇప్పటివరకు విడుదల కానప్పటికీ, 'రామబాణం' మాత్రం సెప్టెంబర్ 14న నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ఇప్పుడు టాప్ వన్ ట్రెండింగ్ లో ఉంది.

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' కూడా అదే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలై కనీసం టాప్ -10 ట్రెండింగ్ లోకి కూడా నిలవలేకపోయింది. కానీ గోపీచంద్ 'రామబాణం' మాత్రం థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచి ఓటీటీలో అదరగొడుతోంది. గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది. కమర్షియల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మే 5న థియేటర్స్ లో విడుదలై  ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభట్ల నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలనుసైతం మిగిల్చింది. గోపీచంద్ సరసన డింపుల్ హయాతి కథానాయికగా నటించిన ఈ మూవీలో సీనియర్ నటుడు జగపతిబాబు, కుష్బూ కీలక పాత్రలు పోషించారు. సచిన్ కేడేకర్, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, నాజర్, వెన్నెల కిషోర్, సప్తగిరి, గెటప్ శీను ఇతర పాత్రల్లో కనిపించారు.

'రామబాణం' కథ ఏంటంటే.. రాజారామ్ (జగపతిబాబు) సుఖీభవ పేరుతో పలు హోటల్స్ నడుపుతుంటారు. ఆ హోటల్స్ పోటీకి తట్టుకోలేని జీకే (తరుణ్ అరోరా) రాజారామ్ హోటల్ లైసెన్స్ ను ఎత్తుకుపోతాడు. దాంతో రాజారాం తమ్ముడు విక్కీ (గోపీచంద్) జీకే పై దాడి చేస్తాడు. ఆ తర్వాత రాజారాం అతన్ని పోలీసులకు పట్టిస్తాడు. పోలీసుల బారి నుంచి తప్పించుకున్న విక్కీ, కోల్ కత్తా కు పారిపోయి పెద్ద డాన్ గా ఎదుగుతాడు. అలాంటి విక్కీ మళ్లీ 15 సంవత్సరాల తర్వాత అన్నయ్య కుటుంబాన్ని వెతుక్కుంటూ వెనక్కి ఎందుకు వచ్చాడు? రాజారామ్ కి శత్రువుల నుంచి ఎలాంటి ఆపద వచ్చింది? దాన్ని విక్కీ ఎలా అడ్డుకున్నాడు? అనేది ఈ సినిమా కథ.

మరోవైపు రామబాణం వంటి డిజాస్టర్ తర్వాత గోపీచంద్ 'భీమా' అనే హాయ్ వోల్టేజ్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. చాలాకాలం తర్వాత ఈ మూవీలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'కేజిఎఫ్' మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : ఓటీటీలో అభిషేక్ పిక్చర్స్ 'ప్రేమ విమానం' - రిలీజ్ ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget