అన్వేషించండి

Kanguva Sequel: ‘కంగువ’ రెండు పార్టులా? సూర్య ఫాంటసీ యాక్షన్ డ్రామాకూ సీక్వెల్

సూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్న లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘కంగువ’. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో కీలక అప్ డేట్ ఇచ్చారు.

Kanguva Movie Sequel Confirmed: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య ఐదు డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా కంగ అనే ఓ పోరాట యోధుడిగా ఆకట్టుకోనున్నట్లు సమాచారం. అక్టోబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. మరోవైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

రెండు భాగాలుగా విడుదలకాబోతున్న ‘కంగువ‘

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఎవరూ టచ్ చేయని కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందుకోసం భారీ బడ్జెట్ ను వెచ్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘కంగువ’ సినిమాకు సంబంధించి నిర్మాత జ్ఞానవేల్ రాజా కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు తెలిపారు. “’కంగువ’ సినిమాకు సంబంధించి రెండు భాగాలుగా కథ రాసుకున్నాం. పార్ట్ 1, పార్ట్ 2గా తీసుకురావాలనుకుంటున్నాం. రెండో భాగాన్ని పూర్తి చేశాం. సీక్వెల్ నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంది. ‘కంగువ 1’ చిత్రీకరణ పూర్తి చేయడానికి 185 రోజులు తీసుకున్నాము. రెండో భాగం 2025 చివరల్లో లేదంటే.. 2026 ప్రారంభంలో షూటింగ్ మొదలవుతుంది. ‘కంగువ 2’ని 2027 జనవరిలో లేదంటే.. సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నాం.     

సీక్వెల్ పై అంచనాలు పెంచనున్న ‘కంగువ‘ ఎండింగ్

‘కంగువ’ తొలి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు జ్ఞానవేల్ తెలిపారు. “‘కంగువ’ పార్ట్ 1ను అద్భుతంగా తీస్తే, పార్ట్ 2 మీద మరిన్ని అంచనాలు పెరుగుతాయి. ఈ సినిమా విషయంలోనూ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాం. మొదటి భాగాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నాం. ఈ మూవీ చివరలో ప్రేక్షకులను కట్టిపడేసే సీన్లు ఉంటాయి. ఈ సన్నివేశాలు సీక్వెల్ పై భారీగా అంచనాలు పెంచుతాయి. సెకెండ్ పార్ట్ ఆటోమేటిక్ గా మంచి సక్సెస్ అందుకుంటుంది” అని నిర్మాత జ్ఞానవేల్ రాజా తెలిపారు. మొత్తంగా ‘కంగువ’ సినిమా విషయంలో మేకర్స్ వేస్తున్న ప్లాన్ అదుర్స్ అనిపించేలా ఉంది. అయితే,తొలి భాగం విడుదలయ్యాకే రెండో భాగం ఎలా ఉంటుంది? అనేది ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suriya Sivakumar (@actorsuriya)

ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో విడుదల

ఇక ‘కంగువ’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 38 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Read Also: బికినీ వేసుకుంటేనే అవకాశాలు వస్తాయన్నాడు - పాత రోజులను గుర్తు చేసుకున్న మనీషా కోయిరాలా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget