అన్వేషించండి

Suriya Sivakumar : 48 ఏళ్ళ వయసులో కాలేజీ స్టూడెంట్‌గా సూర్య?

తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన తమిళ హీరో సూర్య కాలేజీ స్టూడెంట్ కాబోతున్నారా?

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత కష్టమైనా పడటానికి రెడీ అనే హీరోలలో సూర్య శివ కుమార్ (Suriya Sivakumar) ఒకరు. సినిమా పట్ల ఉన్న ప్రేమ, ఆ అంకిత భావం ఆయనను ప్రేక్షకులకు దగ్గర చేసింది. జాతీయ పురస్కారాన్ని తెచ్చింది. ఇప్పుడీ హీరో వయసు ఎంతో తెలుసా? 48 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన కాలేజ్ స్టూడెంట్ కాబోతున్నారని తెలిసింది. అదీ సినిమా కోసమే! అసలు వివరాల్లోకి వెళితే... 

సుధా కొంగర దర్శకత్వంలో...
సూర్య హీరోగా 'సూరారై పొట్రు' చేశారు దర్శకురాలు సుధా కొంగర. 'ఆకాశమే నీ హద్దురా' పేరుతో అది తెలుగులో విడుదల అయ్యింది. తమిళ, తెలుగు భాషల్లో ఆ సినిమా విజయం సాధించింది. అంతకు ముందు వెంకటేష్, రితికా సింగ్ ప్రధాన తారాగణంగా 'గురు' సినిమాకు దర్శకత్వం వహించారు సుధా కొంగర. 

'ఆకాశమే నీ హద్దురా' తర్వాత సూర్య, సుధా కొంగర కలిసి మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అందులో సూర్యది కాలేజీ స్టూడెంట్ రోల్ అని కోలీవుడ్ టాక్. అదీ కొన్ని సన్నివేశాల్లో ఆయన విద్యార్థిగా కనిపిస్తారట. ఆ ఎపిసోడ్ కోసం సూర్య బరువు తగ్గాలని అనుకుంటున్నారట. దర్శకురాలు కాక ముందు మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో సుధా కొంగర పని చేశారు. అప్పుడు మణిరత్నం దర్శకత్వంలో సూర్య 'యువ' (తమిళంలో Aaytha Ezhuthu) సినిమా చేశారు. ఆ క్యారెక్టర్ ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తాయట. 

దుల్కర్ సల్మాన్, నజ్రియా కీలక పాత్రల్లో...
హీరోగా సూర్య 43వ చిత్రమిది. అందుకని, Suriya 43 movie పేరుతో అందరూ పిలుస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన దుల్కర్ సల్మాన్, మలయాళ హీరోయిన్ నజ్రియా కీలకమైన క్యారెక్టర్లు చేస్తున్నారు. విలన్ రోల్ హిందీ యాక్టర్ విజయ్ వర్మ చేస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. ఆయనకు 100వ చిత్రమిది.  

Also Read  'గాంజా శంకర్'గా సాయి ధరమ్ తేజ్ ప్రీ లుక్ చూశారా? - రేపే ఫస్ట్ హై!

సూర్య 43వ చిత్రాన్ని ఆయన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుందని సమాచారం. మరోవైపు 'కెజియఫ్', 'కాంతార', త్వరలో విడుదల కాబోయే 'సలార్' సినిమాలతో భారీ చిత్రాలకు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్ కూడా నిర్మిస్తుందని మరో గుసగుస. సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ అడ్వాన్స్ ఇచ్చారు. అది ఈ సినిమా కూడా కావచ్చని టాక్. 

Also Read 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?

ఇప్పుడు సూర్య 'కంగువ' సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం టీజర్ విడుదల చేశారు. ఒక్కసారిగా సినిమాపై అంచనాలను ఆ టీజర్ పెంచింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం కూడా హైలైట్ అయ్యింది. ఆ చిత్రానికి శివ దర్శకత్వం చేస్తున్నారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
Embed widget