అన్వేషించండి

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Santosham Awards : సురేష్ కొండేటి నిర్వహించే సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్‌లో కన్నడ స్టార్లకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో దుమారం రేగింది. దీంతో ఆయన దీనిపై స్పందించారు.

Suresh Kondeti : 'సంతోషం' మ్యాగజైన్ అధినేత, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి ప్రతీ ఏడాది సంతోషం అనే పేరుతో అవార్డులను నటీనటులకు అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 2న అవార్డులు ప్రదానం చేశారు. అయితే ఈ అవార్డుల ఫంక్షన్‌లో పలువురు కన్నడ సెలబ్రిటీలకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా.. దీనిపై సురేష్ కొండేటి ఎట్టకేలకు స్పందించారు.

ట్విటర్‌లో వివరణ..
కేవలం తెలుగులో మాత్రమే కాదు.. మొత్తం సౌత్‌లోని నాలుగు భాషల సెలబ్రిటీలకు సంతోషం సినిమా అవార్డులను అందజేయడం జరుగుతంది. ఈ అవార్డులను సురేష్ కొండేటి మాత్రమే ప్రారంభించి, 21 సంవత్సరాలుగా సక్సెస్‌ఫుల్‌గా వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇన్నేళ్లలో మొదటిసారి కన్నడ సినీ పరిశ్రమ నుంచి సంతోషం అవార్డులకు విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది సంతోషం అవార్డులను మరింత గ్రాండ్‌గా చేయాలన్న ఉద్దేశంతో గోవాను వేదికగా ఎంచుకున్నారు. అయితే అక్కడ కన్నడ సెలబ్రిటీలకు రూమ్స్ విషయంలో ఇబ్బందులు కలిగాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు కన్నడ ప్రేక్షకులు.. సురేష్ కొండేటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో ఆయన ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు.

ఉదేశ్యపూర్వకంగా చేసింది కాదు..
‘అందరికీ నమస్కారం .. గత 21 సం. గా  నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సంవత్సరం చాలా  కష్టపడి, గ్రాండ్‌గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే .. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను. గోవా ఈవెంట్ లో జరిగిన కొంచం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్ కి  రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్ లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్, అది ఉదేశపూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను. నా మీద కావాలనే కొంత మంది బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

కన్నడ వర్సెస్ తెలుగు ప్రేక్షకులు..
సురేష్ కొండేటి తెలుగువాడు కావడంతో కన్నడ ప్రేక్షకులంతా కలిసి తెలుగు ప్రేక్షకులను సైతం విమర్శించడం మొదలుపెట్టారు. ఫంక్షన్ నిర్వహించడం చేతకాకపోతే నిర్వహించడం ఎందుకు అని టాలీవుడ్ మొత్తంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. తప్పు అనేది ఒక వ్యక్తి వల్ల ఇండస్ట్రీ మొత్తాన్ని అనడం కరెక్ట్ కాదని రివర్స్ అవుతున్నారు. మొత్తానికి సురేష్ కొండేటి అవార్డుల ఫంక్షన్ వల్ల తెలుగు, కన్నడ ప్రేక్షకుల మధ్య రచ్చ మొదలయ్యింది.

Also Read: 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget