Krishna Bday Celebrations: ఫ్యామిలీతో లంచ్ అండ్ కేక్ కటింగ్ - సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్
కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు.
Super Star Krishna Ghattamaneni birthday celebrations: కుమార్తెలు, అల్లుళ్లు, కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య సూపర్ స్టార్ కృష్ణ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి ఏడాది కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకోవడం కృష్ణకు అలవాటు. ఈ ఏడాది ఆయన అదే విధంగా చేశారు.
కుటుంబ సభ్యుల నడుమ కృష్ణ కేక్ కట్ చేశారు. అనంతరం అందరితో కలిసి భోజనం చేశారు. కృష్ణ సతీమణి ఇందిరా, ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావు, వీకే నరేష్, సుధీర్ బాబు, మంజుల తదితరులతో పాటు మిగతా కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్లు సందడి చేశారు. కొంత మంది అభిమానులు సైతం కృష్ణను కలిశారు.
Also Read: బిగ్ బాస్ హౌస్ లో టీవీ సెలబ్రిటీలు - 100 రోజుల షో ఒక్క రోజులోనే చూపిస్తారట!
Happy birthday SUPER STAR . Glorious 80 years of service to cinema and people . Received CELEBRITY BOOK OF WORld RECORDS on this occasion. Long live the superstar💕🌹 pic.twitter.com/WBuZko8EH3
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) May 31, 2022
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిన్న అల్లుడు సుధీర్ బాబు 'మామా మశ్చీంద్ర' సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రమిది.
Also Read: మున్నాభాయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, సంజయ్ దత్‌తో సీక్వెల్ తీసే ఉద్దేశం దర్శకుడికి లేదా?
View this post on Instagram