By: ABP Desam | Updated at : 07 May 2022 01:02 PM (IST)
'ఊరు పేరు భైరవకోన'లో సందీప్ కిషన్
Hero Sundeep Kishan New Movie: యువ కథానాయకుడు సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్‌ది హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'టైగర్' సినిమా వచ్చింది. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఊరు పేరు భైరవకోన' (Ooru Peru Bhairavakona Movie) టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా (Sundeep Kishan Birthday Special) సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ (OPBK first look), స్పెషల్ మేకింగ్ వీడియో చేశారు.
'ఊరు పేరు భైరవకోన' ఫస్ట్ లుక్ చూస్తే... పాడుబడిన భవంతుల మధ్య నిలబడిన సందీప్ కిషన్, ఆయన చేతిలో ఒక కర్ర, వెనుక అగ్ని కీలలతో మండుతున్న చందమామ... ఆసక్తికరంగా ఉంది. మేకింగ్ వీడియోలోనూ మంటలు కనిపించాయి. ఒంటికి మంట అంటుకోవడంతో నీళ్ళలోకి ఒకరు దూకడం కనిపించింది. మరి, ఆ మంటల్లో ఏం జరిగింది? అనేది ప్రస్తుతానికి మిస్టరీ. ''ఎవరికీ అంతుచిక్కని రహస్య ప్రపంచం భైరవకోనలోకి ప్రవేశించండి'' అని చిత్రబృందం పేర్కొంది.
'ఏక్ మినీ కథ' ఫేమ్ కావ్యా థాపర్, వర్షా బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న 'భైరవకోన' సినిమాను రాజేష్ దండ, బాలాజీ గుప్తా నిర్మిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు.
Also Read: సిక్స్‌ప్యాక్‌తో వచ్చిన సందీప్ కిషన్, 'మైఖేల్' గట్స్ & గన్స్ చూశారా?
సందీప్ కిషన్‌కు ఈ రోజు డబుల్ ధమాకా అని చెప్పాలి. 'ఊరు పేరు భైరవకొన' కంటే ముందు 'మైఖేల్' సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా సందీప్ కిషన్‌కు పలువురు సినిమా ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.
Also Read: 'బాహుబలి 2'ను బీట్ చేస్తుందా? 'కెజియఫ్ 2 కొత్త రికార్డు - 400 నాటౌట్
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్
SSMB28: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా?
Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ
Major Movie: 'మేజర్' లేటెస్ట్ అప్డేట్ - మే 24 నుంచే స్క్రీనింగ్
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!
MP Raghurama Krishn Raju : ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై విచారణ, ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరు!
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు