![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KGF 2 Box Office Collection: 'బాహుబలి 2'ను బీట్ చేస్తుందా? 'కెజియఫ్ 2 కొత్త రికార్డు - 400 నాటౌట్
'కెజియఫ్ 2' సినిమా హిందీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 400 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మరి, 'బాహుబలి 2'ను బీట్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి.
![KGF 2 Box Office Collection: 'బాహుబలి 2'ను బీట్ చేస్తుందా? 'కెజియఫ్ 2 కొత్త రికార్డు - 400 నాటౌట్ KGF 2 Box office Collection Day 23 Yash Film KGF record breaks 400 crore Rupees KGF 2 Box Office Collection: 'బాహుబలి 2'ను బీట్ చేస్తుందా? 'కెజియఫ్ 2 కొత్త రికార్డు - 400 నాటౌట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/07/697a6b2d1be7e848bcb25bd3835bc60b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'కెజియఫ్ 2' సినిమా విడుదలై నాలుగు వారాలు దాటింది. అయినా బాక్సాఫీస్ దగ్గర జోరు తగ్గలేదు. ఆ సినిమా వసూళ్ల వేట ఇంకా కొనసాగుతోంది. అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ కొత్త సినిమాలు వస్తున్నాయి వెళుతున్నాయి. యశ్ సినిమాకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నాయి. లేటెస్ట్ గా హిందీలో 'కెజియఫ్ 2' సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది.
హిందీ మార్కెట్ పరంగా చూస్తే... అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఇప్పుడు 'కెజియఫ్ 2'ది రెండో స్థానం. ఈ సినిమా హిందీ వెర్షన్ వసూళ్లు 400 కోట్లు దాటాయి. హిందీలో నాలుగో శుక్రవారం 3.85 కోట్ల రూపాయల వసూళ్లతో 'కెజియఫ్ 2' టోటల్ హిందీ వెర్షన్ వసూళ్లు 401.80 కోట్లు అయ్యాయి. ఈ సినిమా కంటే ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో వచ్చిన 'బాహుబలి 2' ఉంది.
Also Read: 'కెజియఫ్' యాక్టర్ మోహన్ జునేజా మృతి, శాండిల్వుడ్లో విషాదం
హిందీలో 'బాహుబలి 2' సినిమాకు 510.99 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మరో 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే... ఆ సినిమా రికార్డును బీట్ చేసే అవకాశం 'కెజియఫ్ 2' సొంతం అవుతుంది. అయితే, ఫైనల్ రన్ లో అంత కలెక్ట్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి.
#KGF2 is 400 NOT OUT...
— taran adarsh (@taran_adarsh) May 7, 2022
⭐ Braves #IPL2022
⭐ Braves new films week after week
Yet, triumphantly gallops to ₹ 400 cr Club... Expect another power-packed weekend, biz should jump across mass circuits... [Week 4] Fri 3.85 cr. Total: ₹ 401.80 cr. #India biz. #Hindi version. pic.twitter.com/LFQOYSx4Az
BIGGG NEWS... #KGF2 surpasses #Dangal *lifetime biz*... NOW, 2ND HIGHEST GROSSING *HINDI* FILM... Glorious march towards ₹ 400 cr begins... [Week 3] Fri 4.25 cr, Sat 7.25 cr, Sun 9.27 cr, Mon 3.75 cr, Tue 9.57 cr, Wed 8.75 cr. Total: ₹ 391.65 cr. #India biz. #Hindi pic.twitter.com/PdImtreDrB
— taran adarsh (@taran_adarsh) May 5, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)