News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Regina teaser: 'రెజీనా'తో సునైనా - ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన టీజర్!

సునైనా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'రెజినా'. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ లాంచ్ చేసారు.

FOLLOW US: 
Share:

కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సునైనా, తెలుగు ప్రేక్షకులకు సుపరితమే. 'కుమార్ వర్సెస్ కుమారి' చిత్రంతో టాలీవుడ్‌ లో అడుగుపెట్టినా ఈ బ్యూటీ.. 'సమ్‌ థింగ్ స్పెషల్' '10త్ క్లాస్' వంటి సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత కొన్ని డబ్బింగ్ చిత్రాలతో పలకరించిన అమ్మడు.. శ్రీవిష్ణు సరసన 'రాజ రాజ చోర' సినిమాలో హీరోయిన్ గా నటించి, ఆకట్టుకుంది. చివరగా విశాల్ హీరోగా నటించిన ‘లాఠీ’ చిత్రంలో కనిపించిన సునయన.. ఇప్పుడు ''రెజీనా'' అనే థ్రిల్లర్ మూవీతో రాబోతోంది. 

సునైనా టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న 'రెజీనా' చిత్రానికి డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహిస్తున్నాడు. ఎల్లో బేర్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌ పై స‌తీశ్ నాయ‌ర్ నిర్మిస్తున్నారు. హీరోయిన్ మిస్ అయిందని, ఎవరో సునయను కిడ్నాప్ చేసారని ఇటీవల చిత్ర బృందం హంగామా చేసిన సంగతి తెలిసిందే. మూవీ ప్రమోషన్స్ కోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం సరికాదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితేనేం ఇదంతా ఈ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకూ 'రెజినా' అనే సినిమా ఒకటి ఉందని తెలియని ఆడియన్స్ కూడా దీని గురించి చర్చించారు. 

ఈ నేపథ్యంలో మేకర్స్ 'రెజీనా' ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా, మంగళవారం సాయంత్రం హీరో ఆర్య టీజర్ ను లాంచ్ చేసారు. ''బ్యాంక్ రాబరీ గుర్తుందా..'' అంటూ ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. ఒక యువతి జీవితాన్ని మలుపు తిప్పే బ్యాంక్ దోపిడీ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ అని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. 

సునయన పోషించిన రెజీనా పాత్రలో అనేక వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఆమెకు చాలా మంది అబ్బాయిలతో సంబంధం ఉందనుకునే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో యాక్షన్ తో పాటుగా రొమాన్స్ పాళ్ళు కూడా కాస్త ఎక్కువే అని హింట్ ఇచ్చారు. సునైనా ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ లో నటించడమే కాదు, సిగరెట్ తాకుతూ కనిపించింది. 'ఇక్కడ జాలికి తావే లేదు' అని ప్రస్తావించడాన్ని బట్టి ఇదొక రివెంజ్ స్టోరీ అని తెలుస్తోంది. టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరియు విజువల్స్ ఆకట్టుకున్నాయి. 

'రెజినా' అనేది సునైనాకు ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ మూవీ. ఇందులో వివేక్ ప్రసన్న, నివాస్ ఆదితన్, రీతు మంత్ర, అనంత్ నాగ్, ధీనా, గజరాజ్, బావ చెల్లదురై, అప్పని శరత్, రంజన్, పశుపతిరా మరియు జ్ఞానవేల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సతీష్ నాయర్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చగా, పవి కె పవన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. టోబి జాన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 

సునైనా ఇటీవల 'రెజినా' గురించి మాట్లాడుతూ.. "ఇదొక రివేంజ్ థ్రిల్లర్. నేను చాలా సాదాసీదా మహిళగా, అసాధారణమైన పరిస్థితిలో ఉన్న పాత్రను పోషిస్తున్నాను. ఆమె తన శక్తి మేరకు ఏమి చేయగలదో అనేదే ఈ చిత్రం. ఈ సినిమాతో చాలామంది రిలేట్ అవుతారని నేను అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Read Also: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?

Published at : 31 May 2023 08:13 AM (IST) Tags: Tollywood News Telugu Cinema Sunaina Sunainaa Regina Regina Teaser

ఇవి కూడా చూడండి

Tiger Nageswara Rao: 'వీడు' లిరికల్ సాంగ్ వీడియో - ఒక్క మాస్ పాటతో 'టైగర్ నాగేశ్వరరావు' పాత్ర‌ను చెప్పేశారు!

Tiger Nageswara Rao: 'వీడు' లిరికల్ సాంగ్ వీడియో - ఒక్క మాస్ పాటతో 'టైగర్ నాగేశ్వరరావు' పాత్ర‌ను చెప్పేశారు!

నా కూతురితో పాటూ నేను చనిపోయా - కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ట్వీట్!

నా కూతురితో పాటూ నేను చనిపోయా - కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ట్వీట్!

మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?

మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్

Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్

New Parliament: కొత్త పార్లమెంట్‌ వద్ద తమన్నా, మంచు లక్ష్మీ, దివ్యా దత్తా - మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏమన్నారంటే?

New Parliament: కొత్త పార్లమెంట్‌ వద్ద తమన్నా, మంచు లక్ష్మీ, దివ్యా దత్తా - మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏమన్నారంటే?

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?