Suma Adda Latest Promo: సుమ షోలో ‘కుర్చిని మడతపెట్టి’ డైలాగ్ - దానికి అర్థం అడిగిన హీరోయిన్ నేహా శెట్టి
‘బెదురులంక’లో హీరోగా నటించిన కార్తికేయతో పాటు హీరోయిన్ నేహా శెట్టి, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, దర్శకుడు క్లాక్స్ కూడా ‘సుమ అడ్డా’లో పాల్గొన్నారు.
తనతో పాటు తన షోకు వచ్చిన సెలబ్రిటీలతో కూడా పంచులు వేయించి ప్రేక్షకులను అలరిస్తుంది సుమ. ఇక తను హోస్ట్ చేస్తున్న ‘సుమ అడ్డా’ షోలో మరో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ప్రతీ శనివారం బుల్లితెర ప్రేక్షకులను అలరించే ‘సుమ అడ్డా’.. ఈ వారం కూడా మరికొందరు సెలబ్రిటీలతో ఫన్ చేయడానికి సిద్దమయ్యింది. ఈ వారం ఈ షోలో ‘బెదురులంక’ టీమ్ సందడి చేయనుంది. ‘బెదురులంక’లో హీరోగా నటించిన కార్తికేయతో పాటు హీరోయిన్ నేహా శెట్టి, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, దర్శకుడు క్లాక్స్ కూడా ‘సుమ అడ్డా’లో పాల్గొన్నారు.
కార్తికేయ ఎంటర్ అయిన దగ్గర నుంచి సుమ.. తన పంచులతో హీరోను ఆడుకునే ఉంది. ఆ తర్వాత నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌ను టార్గెట్ చేస్తూ ‘‘ఇంస్ట్రీకి ముందు వచ్చింది మీరే కదా?’’ అని అడిగింది. దానికి సమాధానంగా శ్రీకాంత్.. ‘‘ఇండస్ట్రీకి ముందు వచ్చింది మీరు’’ అంటూ సమాధానమిచ్చాడు. ‘‘నాకంటే ముందు ఆయన ఇండస్ట్రీకి వచ్చి, నేనేం చేస్తున్నానో చూస్తూ ఆ తర్వాత ఎంటర్ అయ్యారు. నిజం చెప్పండి’’ అంటూ శ్రీకాంత్ మీద పంచ్ వేయాలని చూసింది సుమ. దానికి శ్రీకాంత్.. ‘‘ఇండస్ట్రీ కన్నా ముందు వచ్చింది మీరే’’ అంటూ రివర్స్ పంచ్ ఆడియన్స్‌లో నవ్వుల్లో ముంచేసింది.
కుర్చీని మడతపెట్టి..
ఆడియన్స్ నుంచి వచ్చి ఫన్ చేయడానికి ట్రై చేశాడు ఓ కుర్రాడు. అప్పుడే ‘‘కుర్చీని మడతపెట్టి..’’ అంటూ డైలాగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చింది. అసలు ఆ డైలాగ్ ఏంటో అర్థం కానీ హీరోయిన్ నేహా శెట్టి ‘కుర్చీ వాట్?’ అని అడిగింది. ‘‘కొన్ని తెలుసుకోవాలి అనుకోకు. నాలాగా ఉండడం నేర్చుకో. అన్ని తెలుసుకున్నా తెలియనట్టు ఉంటాను కదా’’ అంటూ తన గురించి తాను చెప్పి అందరినీ నవ్వించింది సుమ. శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రం కుర్చీ డైలాగు మళ్లీ కావాలి అంటూ దానికి ఇమిటేట్ చేసి చూపించారు. ప్రోమోలో ఇన్ని నవ్వుల మధ్య కార్తికేయ.. నేహా శెట్టికి గులాబీ పువ్వులు ఇచ్చి ప్రపోజ్ చేయడం చాలా క్యూట్‌గా అనిపించింది.
‘జై చిరంజీవ’ స్ఫూఫ్..
చిరంజీవి, వేణు మాధవ్ కలిసి ‘జై చిరంజీవి’లో చేసిన కామెడీకి స్పూఫ్ చేయాలని ప్రయత్నించారు కార్తికేయ, క్లాక్స్. వీరిద్దరు ఈ స్ఫూఫ్‌లో డైలాగులు పూర్తిగా మార్చేసి అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు. మధ్యలో నేహా శెట్టి, కార్తికేయ కలిసి ‘ఆకు చాటు పిందె తడిసె’ అనే క్లాసిక్ పాటకు కలిసి స్టెప్పులేశారు. అలా ‘సుమ అడ్డా’ తాజా ప్రోమో మొత్తం సీరియస్‌నెస్ లేకుండా సరదాగా సాగిపోయింది. మధ్యమధ్యలో అందరూ ఉపయోగించే తెలుగు పదాలు అర్థం కానీ నేహా శెట్టి అడిగే ప్రశ్నలకు ఆడియన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా నవ్వుకున్నారు. దర్శకుడు క్లాక్స్ తనలో మంచి డైరెక్టర్‌తో, ఆర్టిస్ట్‌తో పాటు నటుడు కూడా ఉన్నాడని చూపించుకున్నాడు. ఇక ‘సుమ అడ్డా’లోని గేమ్స్ విషయంలో కూడా హీరో, హీరోయిన్ టీమ్, యాక్టర్, డైరెక్టర్ టీమ్ పోటాపోటీగా ఆడారని ప్రోమో చూస్తే తెలుస్తోంది.
Also Read: ‘జైలర్’లో విలన్‌గా మమ్మూటీకి ఫస్ట్ ఛాన్స్ - ఫోన్ చేసి, వద్దని చెప్పిన రజినీ, ఎందుకంటే..
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial