News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Jailer: ‘జైలర్’లో విలన్‌గా మమ్మూటీకి ఫస్ట్ ఛాన్స్ - ఫోన్ చేసి, వద్దని చెప్పిన రజినీ, ఎందుకంటే..

‘జైలర్’లో హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించగా.. మెయిన్ విలన్‌గా వినాయకన్ కనిపించారు. అయితే నెల్సన్ ముందుగా వినాయకన్‌ను కాకుండా వేరే స్టార్ హీరోను విలన్‌గా అనుకున్నట్టు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

ఒక సినిమా తెరకెక్కించాలని దర్శకుడు అనుకున్న దగ్గర నుంచి ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేవరకు అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కథ మారవచ్చు, అందులోని పాత్రలు మారవచ్చు, నటీనటుల డేట్స్ దొరకక ఆ స్థానంలో వేరేవారు రావచ్చు. తాజాగా ‘జైలర్’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ‘జైలర్’ కోసం కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ స్టార్స్‌ను కలిపాడు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ఇందులో హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించగా.. మెయిన్ విలన్‌గా వినాయకన్ కనిపించారు. అయితే నెల్సన్ ముందుగా వినాయకన్‌ను కాకుండా వేరే స్టార్ హీరోను విలన్‌గా అనుకున్నట్టు ‘జైలర్‌’లో కీలక పాత్ర పోషించిన వసంత్ రవి బయటపెట్టాడు.

ముగ్గురు సూపర్‌స్టార్స్ కలిసి..
ఆగస్ట్ 10న విడుదలైన ‘జైలర్’ వారం రోజులు అయినా కూడా ఇంకా స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. చాలాకాలం తర్వాత సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఈ రేంజ్‌లో హిట్ పడింది. ఇందులో రజినీకాంత్ పాత్ర ఎంత ఉందో.. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాత్ర కూడా అంతే ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే సినిమాకు ముందు నుండే హైప్ తీసుకురావడం కోసం భారీ క్యాస్టింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు నెల్సన్. మాలీవుడ్ నుంచి మోహన్ లాల్‌ను, శాండిల్‌వుడ్ నుంచి శివరాజ్‌కుమార్‌ను కీలక పాత్రల కోసం ఎంపిక చేశాడు. ఈ ముగ్గురు సూపర్‌స్టార్స్ మధ్య వచ్చే క్లైమాక్స్ సీన్స్ సినిమాకే ప్రాణంగా నిలిచాయి. అందుకే ఇందులో మెయిన్ విలన్ పాత్రలో వినాయకన్‌ను కాకుండా ముందుగా మరో మాలీవుడ్ సూపర్‌స్టార్ మమ్మూట్టిని అనుకున్నాడట దర్శకుడు. 

విలన్‌గా చేయొద్దని మమ్మూటీకి రజీనీ కాల్
‘జైలర్’లో రజినీకాంత్ కొడుకు పాత్రలో నటించిన వసంత్ రవికి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఈ నటుడు ముందుగా ‘జైలర్’లో మమ్మూట్టీని విలన్‌గా అనుకున్న విషయాన్ని బయటపెట్టాడు. ఈ విషయం స్వయంగా రజినీకాంతే తనకు చెప్పారని అన్నాడు. అంతే కాకుండా ‘జైలర్’ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో కూడా ‘ఈ సినిమాలో విలన్ రోల్ చేయడం కోసం ఒక పెద్ద యాక్టర్‌ను అనుకున్నాం అని రజినీ స్పీచ్‌లో తెలిపారు. కానీ ఎందుకో వర్కవుట్ అవ్వదు అనిపించి నేనే మళ్లీ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి నా మనసులో మాటలను చెప్పాను. ఆయనకు కూడా అది కరెక్టే అనిపించి నెల్సన్‌తో మాట్లాడారు అని అన్నారు. కానీ ఆ నటుడు ఎవరు అనేది రివీల్ చేయలేదు. తాజాగా వసంత్ రవి ద్వారా ఆ నటుడు మమ్మూట్టీ అన్న విషయం బయటికొచ్చింది.

నెల్సన్‌పై నమ్మకంతో..
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇంతకు ముందు విజయ్‌తో తెరకెక్కించిన ‘బీస్ట్’ సినిమా డిసాస్టర్ అవ్వడంతో రజినీకాంత్.. అసలు ఆ దర్శకుడితో మూవీ ఎందుకు ఓకే చేశాడంటూ ప్రేక్షకులు నెగిటివ్‌గా మాట్లాడడం మొదలుపెట్టారు. అయినా కూడా రజినీ అవేమి పట్టించుకోకుండా నెల్సన్‌తో సినిమా తీసి హిట్ కొట్టి చూపించారు. ‘జైలర్’ హిట్‌ విషయంలో కీలకంగా నిలిచిన మరొక అంశం అనిరుధ్ రవిచందర్ సంగీతం. ఆడియో లాంచ్‌లో అనిరుధ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్‌ను ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. అదే విధంగా ‘జైలర్’లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో రజినీకి జోడీగా చాలాకాలం తర్వాత రమ్యకృష్ణ నటించింది.

Also Read: ‘ఓఎమ్‌జీ 2’కు ఒక్క రూపాయి కూడా తీసుకోని అక్షయ్ కుమార్, అసలు కారణం చెప్పిన నిర్మాత

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 18 Aug 2023 12:37 PM (IST) Tags: Rajinikanth Mohanlal Anirudh Ravichander Mammootty Jailer Vasanth Ravi sivarajkumar nelson dileepkumar vinayakan

ఇవి కూడా చూడండి

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Prabhas Marriage: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!

Prabhas Marriage: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!

Aditi Govitrikar: అందుకు ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేశారు - క్యాస్టింగ్ కౌచ్‌పై నోరువిప్పిన ‘తమ్ముడు’ బ్యూటీ

Aditi Govitrikar: అందుకు ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేశారు - క్యాస్టింగ్ కౌచ్‌పై నోరువిప్పిన ‘తమ్ముడు’ బ్యూటీ

Aravind Krishna Actor: ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ హీరో

Aravind Krishna Actor: ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ హీరో

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ