అన్వేషించండి

Janaka Aithe Ganaka: ప్రతిదానికి డబ్బులు లెక్కలేసుకునే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయికి పెళ్లయితే.. నవ్విస్తున్న 'జనక అయితే గనక' ట్రైలర్‌

Janaka Aithe Ganaka Trailer: టాలెంటెడ్‌ నటుడు సుహాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ జనక అయితే గనుక. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. 

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తు వస్తున్నాడు 'కలర్‌ ఫోటో' ఫేం సుహాస్‌. సినిమాల్లో సహనటుడు, హీరో ఫ్రెండ్‌ రోల్స్‌తో మెప్పించిన సుహాస్‌ కలర్‌ ఫోటోతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే సూపర్‌ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా హీరోగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే 'రైటర్‌ పద్మభూషణ్‌, అంబాజీ పేట మ్యారేజ్‌ బ్యాండ్, ప్రసన్న వదనం చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. ఈ సారి కూడా సరికొత్త కథతో సిద్ధం అయ్యాడు.

'జనక అయితే గనక' అనే ఆసక్తికర టైటిల్‌తో ఫ్యాన్స్‌ని అలరించేందుకు వస్తున్నాడు. ఇందులో సుహాస్‌ సరసన సంగీర్తన జంటగా నటిస్తోంది. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఇ సినిమా సెప్టెంబర్‌ 7న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు మూవీ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంటుంది. ఇందులో సుహాస్‌ ప్రతిదానికి డబ్బులు లెక్కలు వేసుకునే మిడిల్‌ క్లాస్‌ యువకుడిగా అలరించబోతున్నాడని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది.  

ట్రైలర్‌ విషయానికి వస్తే

ట్రైలర్‌ సుహాస్‌, వెన్నెల కిషోర్‌ సీన్‌తో మొదలైంది. పిల్లలు వద్దని చెప్పి పెళ్లాని ఎలా మ్యానేజ్‌ చేశావురా! అదే నాకు వండర్‌ అనిపిస్తుంది" అనే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. నువ్వు చెప్పవ్‌ పర్సనల్‌ కానీ, నేను చెప్పాలి పబ్లిక్‌ అంటూ ప్రారంభంలోనే ట్రైలర్‌పై ఆసక్తి పెంచారు. ఆ తర్వాత పెళ్లయిన హీరో పిల్లలు వద్దని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంటాడు. కానీ, కుటుంబం మొత్తం పిల్లలు కావాలని డిమాండ్‌ చేస్తుంటారు. అలా ట్రైలర్‌ మొత్తం ఇదే అంశంతో సాగింది. ఈ క్రమంలో హీరో ఇంట్లో చోటుచేసుకున్న సంఘటనలను వినోదాత్మకంగా చూపించారు. ఇక చివరిగా భార్య గర్భం దాల్చడంతో హీరో తీసుకున్న నిర్ణయం ప్రతిఒక్కరిని షాకిస్తుంది. ఆఖరికి లాయర్‌ కూడా షాక్‌ అవుతుంది.

ఇలా ట్రైలర్‌ మొత్తం ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. ఇక వెన్నెల కిషోర్‌, సుహాస్‌ మధ్య ఉండే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హీరో బామ "నీ వయసుకి వాడితో ఫ్రెండ్‌షిప్‌ ఎంట్రా అని అడగ్గ.. వెన్నెల కిషోర్‌ ఇంతకంటే వయసు గ్యాప్‌ ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోంగా దిక్కులేదు.. ఫ్రెండిషిప్‌ చేస్తేనే ప్రాబ్లమ్‌ వచ్చిందా?" అనే డైలాగ్‌ ట్రైలర్‌లో హైలెట్‌గా అని చెప్పాలి. ట్రైలర్‌ని సిల్లీ కారణంతో కేసు పెట్టి ఆ కారణాన్ని రివీల్‌ చేయకుండ ట్రైలర్‌ని ట్విస్ట్‌తో ముగించి సినిమాపై మరింత హైప్‌ పెంచారు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌, మూవీ అవుట్‌ పుట్‌ చూసి సుహాస్‌ ఈ సినిమా డిస్ట్రీబ్యూటర్‌గా మారాడు. ఇండియాలో కాకుండా ఓవర్సిస్‌లో తన చిత్రాన్ని రిలీజ్‌ చేస్తూ సాహసమైన నిర్ణయం తీసుకున్నాడు. 

Also Read: హేమ కమిటీ రిపోర్టు ఎఫెక్ట్‌ - తీవ్ర విమర్శలు, 'అమ్మా'కు మోహన్‌లాల్‌ రాజీనామా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget