అన్వేషించండి

Ambajipeta Marriage Band Teaser: 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్ - మళ్లీ ఏడిపించేసిన సుహాస్!

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్'. దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

టాలీవుడ్ లో 'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్' వంటి సినిమాలతో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోలతో కెరీర్ ప్రారంభించిన సుహాస్ 'కలర్ ఫొటో' సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించాడు. ఆ తర్వాత 'ఫ్యామిలీ డ్రామా' అనే మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక అడవి శేష్ నటించిన 'హిట్ 2' సినిమాలో ఏకంగా విలన్ గా తన నటనతో ఆకట్టుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

రీసెంట్ గా 'రైటర్ పద్మభూషణ్' తో మంచి సక్సెస్ అందుకున్న సుహాస్ తాజాగా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచగా తాజాగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఫన్ మూమెంట్స్ తో స్టార్ట్ అయిన టీజర్ చాలా ఎమోషనల్ గా ఎండ్ అయింది. టీజర్ ని గమనిస్తే..' చెప్పవే చిరునామా అంటూ బ్యాండ్ మ్యూజిక్ తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం లవ్ కంఫర్ట్ యాక్షన్ తో సాగింది. మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ నటించారు.

టీజర్ లో హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. సుహాస్ ఫన్ తో పాటు సీరియస్ యాక్టింగ్, ఫైట్స్ కూడా చేశాడు. చివర్లో ఏదో కోల్పోయి గుండు కూడా గీయించుకున్నట్టు కనిపించాడు. శేఖర్ చంద్ర అందించిన బీజీయం కూడా ఆకట్టుకుంది'. ఊర్లో సెలూన్ నడుపుతూనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో డప్పు కొడుతూ ఉండే మల్లిని కాలేజ్ లో ఒక అమ్మాయి ఇష్టపడుతుంది. వీరిద్దరి లవ్ స్టోరీ ఎక్కడివరకు వెళ్ళింది.. ? అసలు మల్లి కథలోకి వచ్చిన మరో ఇద్దరు ఎవరు? అనేది సినిమా చేసే తెలుసుకోవాలి. మొత్తం గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ తో మరోసారి సుహాస్ ఫన్ తో పాటు ఆడియన్స్ ని ఎమోషనల్ చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. టీజర్ చివరిలో సుహాస్ కు గుండు కొట్టిస్తూ ఉన్న షాట్ చూస్తుంటే సినిమా కోసం సుహాస్ ఎంత రిస్క్ చేశాడనేది అర్ధం అవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ గా మారింది. ఇందులో సీనియర్ నటుడు గోపరాజు రమణ, పుష్ప ఫ్రేమ్ జగదీష్ బండారి ఇతర కీలక పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎటాచ్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి వాజిద్ బేగ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. నవంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రామ్ పసుపులేటి దర్శకత్వంలో 'ఆనందరావు అడ్వెంచర్స్' అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు సుహాస్. రీసెంట్ గా విడుదలైన టైటిల్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read : లియో'లో కమల్ హాసన్ సర్ప్రైజ్ ఎంట్రీ? దాచిపెట్టాం, ఇంకా చాలా ఉన్నాయంటున్న లోకేష్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu : బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్
బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్
Chennai Love Story OTT : చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Rajinikanth Biopic: బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ జర్నీ... వెండితెరపైకి రజనీకాంత్ ఆత్మకథ
బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ జర్నీ... వెండితెరపైకి రజనీకాంత్ ఆత్మకథ

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget