Sudheer 15 Update: సుధీర్ బాబుతో ఈషా రెబ్బా, మృణాళిని రవి - హైదరాబాద్‌లో
సుధీర్ బాబు కథానాయకుడిగా నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. అందులో కథానాయికలుగా ఈషా రెబ్బా, మృణాళిని రవి నటిస్తున్నారు.

సుధీర్ బాబు కథానాయకుడిగా నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు 15వ చిత్రమిది.
Sudheer 15 Title and First Look: ఈ రోజు సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. అలాగే, టైటిల్ అనౌన్స్ చేస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే... ఇందులో సుధీర్ బాబు సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒకరు ఈషా రెబ్బా, మరొకరు 'గద్దలకొండ గణేష్' ఫేమ్ మృణాళిని రవి. యాక్షన్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఇద్దరికీ మంచి రోల్స్ ఉన్నాయట. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో సుధీర్ బాబు డీజే రోల్ చేస్తున్నారు.
Also Read: ఆ నిర్ణయం నాది కాదు & గౌతమ్ వేరు, సితార వేరు! - పిల్లల గురించి మహేష్ బాబు ఏమన్నారంటే?
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

