Sudheer Babu: క్షమించండి, నేను అలాంటి వ్యక్తిని కాదు - ప్రణీత్ హనుమంతు వివాదంపై సుధీర్ బాబు కామెంట్స్
Sudheer Babu: తాజాగా యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీపై పలువురు సెలబ్రిటీలు స్పందించడానికి ముందుకొచ్చారు. తాజాగా సుధీర్ బాబు కూడా ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేశాడు.
![Sudheer Babu: క్షమించండి, నేను అలాంటి వ్యక్తిని కాదు - ప్రణీత్ హనుమంతు వివాదంపై సుధీర్ బాబు కామెంట్స్ Sudheer Babu reacts on Praneeth Hanumanthu as he is a part of his movie Harom Hara Sudheer Babu: క్షమించండి, నేను అలాంటి వ్యక్తిని కాదు - ప్రణీత్ హనుమంతు వివాదంపై సుధీర్ బాబు కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/a875bdab09523c9379713c8e4e3fad231720439130722802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sudheer Babu Tweet About Praneeth Hanumanthu Controversy: సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ఎవరికి నచ్చింది వాళ్లు మాట్లాడే స్వేచ్ఛ వచ్చేసింది. కానీ ఆ స్వేచ్ఛను మంచి కోసంకంటే చెడు కోసం ఉపయోగిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసింది కూడా అదే. విచక్షణ లేకుండా ఎలాంటి జోకులు అయినా చేస్తూ.. వాటిపై కంటెంట్ క్రియేట్ చేసేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారిలో ఒకడిగా మారిపోయాడు ప్రణీత్. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రణీత్ హనుమంత్ కామెంట్స్‌ను ఖండిస్తూ తనకు శిక్ష పడాలని కోరగా.. తాజాగా సుధీర్ బాబు కూడా ఈ విషయంపై స్పందించారు.
అలాంటి వ్యక్తిని కాదు..
చాలామంది యూట్యూబర్స్.. వెండితెరపై కూడా అడుగుపెట్టి తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. చాలాకాలంగా యూట్యూబర్‌గా సక్సెస్ అయిన ప్రణీత్ హనుమంతు కూడా సుధీర్ బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు. దీంతో ప్రణీత్ చేసిన వ్యాఖ్యలకు, దాని వల్ల క్రియేట్ అయిన కాంట్రవర్సీకి హీరో సుధీర్ బాబు స్పందించక తప్పలేదు. ‘‘మంచో, చెడో తెలియదు కానీ నేను అంతగా సోషల్ మీడియా ఉపయోగించే వ్యక్తిని కాదు. అంతే కాకుండా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా నేను పెద్దగా ఫాలో అవ్వను’’ అంటూ తను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండనని చెప్పుకొచ్చాడు సుధీర్ బాబు.
క్షమాపణలు..
‘‘అసలు ‘హరోం హర’లో ప్రణీత్ హనుమంతును క్యాస్ట్ చేశామన్న విషయం తలచుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నా తరపున, నా టీమ్ తరపున అందరికీ క్షమాపణలు. అసలు అతడు అలాంటి మనిషి అని మాకు తెలియదు. నాకు తన గురించి ఏ మాత్రం తెలియదు. అతడి గురించి సోషల్ మీడియాలో బయటపడిన విషయాలు మొత్తం చూడడానికి కూడా నేను ధైర్యం చేయలేకపోయాను. అవి చూసి మనం కనీసం వాంతి చేసుకోవడానికి కూడా పనికిరావు. కానీ ఇలాంటి సమయంలో వాటిపై మనం దృష్టిపెట్టాలి. తమలో ఉన్న చెడు ఆలోచనలను బయటపెట్టడానికి ఇలాంటి దారుణమైన మైండ్ ఉన్న మనుషులకు అసలు ప్లాట్‌ఫార్మ్ అనేది దొరక్కూడదు. ఇది భావప్రకటన స్వేచ్ఛ అసలు కాదు’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు సుధీర్ బాబు.
For good or bad, I'm not a social media guy nor do I keep up with things. I feel so disgusted by the fact we had #PraneethHanumanthu casted in #HaromHara. Sincere apologies from me and my entire team. We didn't know what a pathetic creature this man is. It wasn't in my knowledge.…
— Sudheer Babu (@isudheerbabu) July 8, 2024
Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)