Sudheer Babu New Movie Update : సుధీర్ బాబుది హై వోల్టేజ్ యాక్షన్ 'హంట్' గురూ, ఫస్ట్ లుక్ చూశారా?
సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ నేడు ప్రకటించారు. వి. ఆనంద ప్రసాద్ నిర్మాణంలో ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. 'వి' తర్వాత మరోసారి ఆయన ఖాకీ చొక్కా వేసుకుంటున్నారు. ఆ సినిమాలో ప్యాక్డ్ బాడీ చూపించారు. మరి, ఈ సినిమాలో చూపిస్తారో? లేదో? ఆ సంగతి పక్కన పెడితే... ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు (Sudheer Babu First Look Hunt Movie).
సుధీర్ బాబు 'హంట్'
సుధీర్ బాబు, వి. ఆనంద్ ప్రసాద్ కలయికలో రూపొందుతున్న చిత్రానికి 'హంట్' (Hunt Movie Telugu) టైటిల్ ఖరారు చేశారు. గన్స్ డోంట్ లై... అనేది సినిమా ఉపశీర్షిక. గన్స్ అబద్ధాలు చెప్పవన్నమాట. ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు. పోలీస్ ఆఫీసర్ ఎవరి కోసం వేట మొదలు పెట్టారు? ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సుధీర్ బాబుతో పాటు ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్, తమిళ కథానాయకుడు - 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు.
గుమ్మడికాయ కొట్టేశారు!
టైటిల్ వెల్లడించడంతో పాటు 'హంట్' షూటింగ్ కంప్లీట్ అయ్యిందని 'భవ్య' క్రియేషన్స్ అధినేత, చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్... సినిమాలో ఈ ముగ్గురూ సన్నిహిత స్నేహితులుగా కనిపిస్తారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇప్పటి వరకూ వచ్చిన సుధీర్ బాబు చిత్రాలకు పూర్తి భిన్నంగా సినిమాను రూపొందిస్తున్నాం. యాక్షన్ సీక్వెన్సులు నేచురాలిటీకి దగ్గరగా ఉంటాయి. కనిపించని శత్రువును పట్టుకోవడం కోసం ఎటువంటి వేట సాగించారన్నది కథ'' అని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
భరత్‌కు స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది!
'ప్రేమిస్తే' ఫేమ్ భరత్‌కు స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది. ఇంతకు ముందు మహేష్ బాబు 'స్పైడర్'లో ఆయన నటించారు. అయితే, అది బైలింగ్వల్. 'హంట్'తో తెలుగు తెరకు ఆయన పరిచయం అవుతున్నారు. ఈ సినిమా కథ విన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యారని, వెంటనే ఓకే చెప్పేశారని తెలిసింది. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ మధ్య సన్నివేశాలు... సుధీర్ బాబు యాక్షన్ సీన్స్ హైలైట్ అవుతాయని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందుతోన్న సమాచారం.
Also Read : ఆదిపురుష్ @ 35000 షోస్
సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ పోలీస్ అధికారులుగా నటిస్తున్న ఈ సినిమాలో 'మైమ్' గోపి, 'జిల్' ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్ గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం.
ఈ చిత్రానికి కళ : వివేక్ అన్నామలై, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.
Also Read : వెంకటేష్ ఊ అంటారా? ఊహూ అంటారా?
You think the HUNT is done FOR ME?
— Sudheer Babu (@isudheerbabu) August 28, 2022
Little did you know that the HUNT is done BY ME !!https://t.co/l9SeRBHT48#Sudheer16 is titled #HUNT 👊 #HuntTheMovie@bharathhere @actorsrikanth @Imaheshh @GhibranOfficial #Anandaprasad @BhavyaCreations @anneravi @vincentcinema pic.twitter.com/mxMCNPMEHH