News
News
X

Venkatesh New Movie Update : వెంకటేష్ ఊ అంటారా? ఊహూ అంటారా?

'జాతి రత్నాలు'తో వెలుగులోకి వచ్చిన దర్శకుడు కేవీ అనుదీప్. తన తర్వాత సినిమా విక్టరీ వెంకటేష్‌తో అని తెలిపారు. అయితే... అందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే?

FOLLOW US: 

వినోదాత్మక కుటుంబ కథా చిత్రాలు చేయడంలో సిద్ధహస్తులైన విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) తో తన తదుపరి సినిమా ఉంటుందని దర్శకుడు కేవీ అనుదీప్ (Anudeep KV) తెలిపారు. అయితే... అందులో ఒక ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే... వెంకటేష్‌కు కథ నచ్చాలని, ఆయన ఓకే చెప్పాలని అన్నారు. సో... విషయం ఏంటంటే? వెంకీతో సినిమా చేయాలని అనుదీప్‌కు ఉంది. ఇంకా కథ చెప్పలేదు. త్వరలో నేరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

Anudeep KV Yet To Narrate Story To Venkatesh : వెంకటేష్‌కు అనుదీప్ కథ నచ్చాలి, ఆయన ఓకే చెప్పాలి. అప్పుడు సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ''భావోద్వేగాలతో కూడిన వినోదాత్మక కథను వెంకటేష్ గారి కోసం రెడీ చేశా'' అని అనుదీప్ చెప్పారు. ఆయన కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా 'ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show Movie). సెప్టెంబర్ 2వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించిన కేవీ అనుదీప్, వెంకటేష్ సినిమా సంగతి చెప్పారు.
 
'జాతి రత్నాలు' సీక్వెల్ ఎప్పుడు అంటే?
'జాతి రత్నాలు' సినిమాతో అనుదీప్ కేవీ వెలుగులోకి వచ్చారు. ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలో వినిపించింది. ఆ సంగతి ఏంటి? అని ప్రశ్నించగా... ''నా దగ్గర సీక్వెల్ కోసం ఐడియాలు ఉన్నాయి. మూడు, నాలుగు ఏళ్లలో ఆ సినిమా చేస్తా'' అని ఆయన తెలిపారు. 'జాతి రత్నాలు' సినిమాతో నవీన్ పోలిశెట్టికి మంచి పేరు వచ్చింది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో కలిసి ఆయన చేసిన కామెడీ జనాలకు నచ్చింది. 

ప్రస్తుతం తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌తో అనుదీప్ ఒక సినిమా చేస్తున్నారు. దానికి 'ప్రిన్స్' టైటిల్ ఖరారు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమా విడుదల కానుంది. తొలుత ఆగస్టు 31న విడుదల చేయాలనుకున్నా... ఆ తర్వాత దీపావళికి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 

ఫస్ట్ డే ఫస్ట్ షో కథ ఏంటి?
ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా రూపొందిన యూత్ ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో'. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు హీరో హీరోయిన్లుగా నటించారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 

Also Read : ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న సకల అస్త్రాలకు అధిపతి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కోసం నారాయణ ఖేడ్ కుర్రాడు శ్రీను ఏ విధమైన ప్రయత్నాలు చేశాడనేది చిత్ర కథాంశం. నారాయణ ఖేడ్, శంకర్ పల్లి, చేవెళ్ళ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఇందులో 'వెన్నెల' కిశోర్ కీలక పాత్ర చేశారు. 

Also Read : తెలుగులో డిజాస్టర్ దిశగా 'లైగర్', హిందీలో బెటర్ - రోజు రోజు విజయ్ దేవరకొండ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Published at : 27 Aug 2022 12:46 PM (IST) Tags: Venkatesh Anudeep KV First Day First Show movie Venkatesh New Movie Update Prince Movie

సంబంధిత కథనాలు

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Allu Arjun: అల్లు స్టూడియోస్ లాంచ్ చేసిన చిరు - అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్!

Allu Arjun: అల్లు స్టూడియోస్ లాంచ్ చేసిన చిరు - అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్!

Sudheer Babu's Hunt Teaser : నుదుట గాయం, రక్తంతో సుధీర్ బాబు - రిలీజ్‌కు 'హంట్' టీజర్ రెడీ

Sudheer Babu's Hunt Teaser : నుదుట గాయం, రక్తంతో సుధీర్ బాబు - రిలీజ్‌కు 'హంట్' టీజర్ రెడీ

SSMB28: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ - త్రివిక్రమ్ ఒప్పుకుంటారా?

SSMB28: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ - త్రివిక్రమ్ ఒప్పుకుంటారా?

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?