అన్వేషించండి

Adipurush Release Plans : ఆదిపురుష్ @ 35000 షోస్

'ఆదిపురుష్' సినిమాకు ముందు, 'ఆదిపురుష్' తర్వాత అనేలా... ప్రభాస్ కొత్త సినిమా విడుదల కానుందా? ఇండియా అంతటా సినిమా విడుదలైన రోజు శ్రీరామ నామ జపం వినబడుతుందా? అంటే 'అవును' అని చెప్పాలి. 

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏది? అంటే మరో మాట లేకుండా వినిపించే పేరు 'బాహుబలి : ది కంక్లూజ‌న్‌'. ఇప్పటికీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా పేరు మీద ఆ రికార్డు ఉంది. దాని తర్వాతే యశ్ 'కెజియఫ్ 2' అయినా... ఆమిర్ ఖాన్ నటించిన 'దంగల్' అయినా!

'బాహుబలి 2' తర్వాత విడుదలైన 'కెజియఫ్ 2' ఓపెనింగ్ డే, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది. అయితే... ప్రభాస్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను క్రాస్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆ ఓపెనింగ్ రికార్డ్స్ మళ్ళీ ప్రభాస్ పేరు మీద వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 'ఆదిపురుష్'తో ప్రభాస్ నయా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేలా...
హిందీలో 'తానాజీ' వంటి హిట్ సినిమా తీసిన ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజున దేశంలో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇండియాలో ఎన్ని థియేటర్లు / స్క్రీన్‌లు ఉన్నాయి?
ఇండియా మొత్తం మీద, టోటల్ ఎన్ని థియేటర్లు, లేదంటే స్క్రీన్‌లు ఉన్నాయి? అంటే... సుమారు 9,500 అని చెప్పాలి. అందులో ఆరున్నర వేలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు! మిగతావి మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు. గతంలో పది వేలకు పైగా ఉండేవి. కరోనా కాలంలో కొన్ని సింగిల్ స్క్రీన్‌లను గోడౌన్, షాపింగ్ కాంప్లెక్స్‌లు మార్చేశారు. ప్రస్తుతం ఉన్నవాటిలో వీలైనన్ని స్క్రీన్‌ల‌లో 'ఆదిపురుష్' సినిమా ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి.
 
Adipurush Movie Release Plans : ఒక్కో థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలు ప్రదరిస్తారు. ఐదు షోలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో... రోజుకు 40,000 షోస్ వేయొచ్చు. వెయ్యి , పదిహేను వందల థియేటర్లు వేరే సినిమాలకు వదిలేసినా... ఎనిమిది వేల థియేటర్లలో 'ఆదిపురుష్' విడుదల చేస్తే? కొన్ని థియేటర్లలో నాలుగు షోలు, కొన్ని థియేటర్లలో ఐదు షోలు వేస్తే? రోజుకు సుమారు 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్‌ టాక్.

రాముడి కథ కావడంతో బీజేపీ అండ...
రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభు శ్రీరామ్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. హిందూ సంస్కృతి, శ్రీరాముని గొప్పతనం గురించి వివరించే సినిమా కావడంతో పరోక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అండ కూడా 'ఆదిపురుష్' కూడా ఉండవచ్చని అంచనా. 'ది కశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2' సినిమాలకు ఉత్తరాదిలో ఆర్ఎస్ఎస్ నుంచి అండ దండలు లభించాయని టాక్. శ్రీరాముని సినిమా కావడంతో ప్రభాస్‌కు ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ లభించవచ్చు. పైగా... హిందూ సంస్కృతి, దేవుళ్ళ గురించి చెప్పే సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి ఆదరణ బావుంటోంది.
 
రికార్డులు కన్ఫర్మ్!
సుమారు ఎనిమిది వేల థియేటర్లలో 'ఆదిపురుష్' విడుదలైతే? తొలిరోజు 35,000 షోస్ పడితే? ప్రభాస్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. అంతే కాదు, మరొకరు ఆ రికార్డులను అందుకోవడం కష్టం. సినిమాపై ఆల్రెడీ మంచి బజ్ ఉంది. 'సాహో', 'రాధే శ్యామ్' సినిమాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో 'ఆదిపురుష్'తో ప్రభాస్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తాడని ఉత్తరాదిలో ఆయన అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

Also Read : ఎన్టీఆర్ కోసం ప్లాన్ మొత్తం మార్చేసిన కొరటాల? ఆల్ ఓవర్ ఇండియాలో!

'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ జోడీగా సీత పాత్రలో కృతి సనన్, లంకేశ్వరుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. వెండితెరపై రామాయణాన్ని కొత్త కోణంలో దర్శకుడు ఓం రౌత్ ఆవిష్కరించనున్నారట.

Also Read : తెలుగులో డిజాస్టర్ దిశగా 'లైగర్', హిందీలో బెటర్ - రోజు రోజు విజయ్ దేవరకొండ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget