Sudev Nair: మోడల్‌ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్ - సోషల్ మీడియాలో ఫోటోలు షేర్
Sudev Nair Marriage: తెలుగులో ఒకట్రెండు చిత్రాల్లో విలన్‌గా నటించాడు మలయాళ యాక్టర్ సుదేవ్ నాయర్. తాజాగా కేవలం సన్నిహితుల సమక్షంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకొని ఆ సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు.
Sudev Nair Marriage: రీల్ లైఫ్ విలన్.. రియల్ లైఫ్‌లో హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే సినీ పరిశ్రమలో పెళ్లిల్ల హవా నడుస్తోంది. ఇండస్ట్రీలో పని చేసేవారు, ఆ ఇండస్ట్రీలోనే ఉండే వారిని పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఒక మలయాళ నటుడు కూడా మోడల్‌ను వివాహం చేసుకున్నాడు. కేరళ సాంప్రదాయంలో చాలా సింపుల్‌గా ఈ పెళ్లి జరిగింది.
ప్రముఖ మలయాళ నటుడు సుదేవ్ నాయర్.. తన గర్ల్‌ఫ్రెండ్, మోడల్ అమర్‌దీప్ కౌర్‌ను పెళ్లి చేసుకొన్నాడు. ఆ హ్యాపీ మూమెంట్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.
మలయాళంతో పాటు హిందీలో కూడా..
మలయాళ నటుడు సుదేవ్ నాయర్.. ఎక్కువగా సినిమాల్లో విలన్‌గానే కనిపించాడు. సుదేవ్ నాయర్ కుటుంబం కేరళకు చెందినదే అయినా తను మాత్రం ముంబాయ్‌లో సెటిల్ అయ్యాడు. ‘గులాబ్ గ్యాంగ్’ అనే హిందీ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించిన సుదేవ్.. ఆ తర్వాత మాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అక్కడే బ్యాక్ టు బ్యాక్ తనకు అవకాశాలు కూడా వచ్చాయి. హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించినా కూడా సుదేవ్‌కు ఫేమ్ తెచ్చిపెట్టింది మాత్రం విలన్ పాత్రలే. మలయాళంతో పాటు హిందీ, కన్నడలో పలు చిత్రాలతో అలరించాడు. తాజాగా తెలుగులో కూడా అడుగుపెట్టాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు తెలుగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు సుదేవ్.
తెలుగులో సినిమాలు..
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’లో సెకండ్ విలన్‌గా నటించాడు సుదేవ్ నాయర్. ఆ తర్వాత వెంటనే నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో మెయిన్ విలన్‌గా కనిపించాడు. ప్రస్తుతం తన చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేకపోయినా.. రెండు మలయాళ చిత్రాలతో 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా తన పెళ్లి వార్తతో అందరికీ షాకిచ్చాడు. ముంబాయ్‌కు చెందిన నటి, ఫ్యాషన్ మోడల్ అయిన అమర్‌దీప్ కౌర్ స్యాన్‌ను కేరళ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాడు సుదేవ్ నాయర్. తర్వాత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా వారి పెళ్లికి సంబంధించిన వీడియోలు కూడా బయటికొచ్చాయి.
View this post on Instagram
రెండు సాంప్రదాయాల్లో..
అమర్‌దీప్ కౌర్ స్యాన్.. గుజరాత్‌లోని సిక్ ఫ్యామిలీలో జన్మించింది. అందుకే సుదేవ్‌తో కేరళ సాంప్రదాయంలో తన పెళ్లి జరిగిన తర్వాత వీరిద్దరూ వెళ్లి స్థానిక గురువాయూర్ ఆలయంలో పూజలు నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు అమర్‌దీప్ కౌర్ నటిగా సినిమాలు ఏమీ చేయకపోయినా.. ఎన్నో బ్యూటీ పోటీలలో పాల్గొంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్‌ను షేర్ చేస్తూ యూత్‌ను ఆకట్టుకుంటుంది. సుదేవ్, అమర్‌దీప్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వీరి రిలేషన్‌షిప్ గురించి ఓపెన్‌గానే ఉన్నారు. ఇప్పుడు సైలెంట్‌గా పెళ్లి కూడా చేసుకొని తమ సంతోషాన్ని ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.
View this post on Instagram
Also Read: రకుల్‌కు కాబోయే భర్త స్పెషల్ సర్‌ప్రైజ్, పెళ్లిలో ఆ సీనియర్ నటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్