Rakul Preet Singh: రకుల్‌కు కాబోయే భర్త స్పెషల్ సర్‌ప్రైజ్, పెళ్లిలో ఆ సీనియర్ నటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్
Rakul Preet Singh - Jackky Bhagnani: రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ గోవాలో తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఇక ఈ పెళ్లిలో ఎన్నో స్పెషల్ సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని సమాచారం.
Rakul Preet Singh - Jackky Bhagnani Wedding: గత రెండేళ్లలో బాలీవుడ్‌లో ఎన్నో సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ఇక ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అవ్వనుంది. హీరో, ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానీని రకుల్ ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. ఫిబ్రవరీ 21న గోవాలో రకుల్, జాకీ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక దానికోసం రెండు రోజుల ముందే అక్కడికి చేరుకున్నారు. రకుల్, జాకీ.. ఇద్దరికీ బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. అందుకే హిందీ సినీ పరిశ్రమలో వీరిద్దరికీ క్లోజ్ అయిన నటీనటులు ఈ వివాహానికి హాజరు కానున్నారు. అంతే కాకుండా ఒక సీనియర్ నటి ఈ పెళ్లిలో డ్యాన్స్ చేయడంతో పాటు తనకు కాబోయే భార్య రకుల్‌కు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్‌ను కూడా ప్లాన్ చేశాడట జాకీ.
గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్..
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ మూడేళ్ల క్రితం తమ ప్రేమ గురించి సోషల్ మీడియాలో ప్రకటించారు. అప్పటినుండి వీరి పెళ్లి ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది అని రూమర్ మొదలయ్యింది. అది రూమర్ కాదు.. నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ పెళ్లిలో తనకు కాబోయే భార్య రకుల్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేశాడట జాకీ భగ్నానీ. అక్కడ తన కోసం పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడని సమాచారం. వారి లవ్ స్టోరీపై ఒక ప్రత్యేకంగా పాటను రాయించాడట జాకీ. మయూర్ పూరీ అనే రైటర్‌తో రకుల్, తన ప్రేమకథను ‘బిన్ తేరే’ అనే పాటను తయారు చేయించాడట. ఈ పాటపై పెళ్లిలో జాకీ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని సమాచారం.
గుర్తుండిపోయే గిఫ్ట్..
‘బిన్ తేరే’ పాటకు తనిష్క్ బాగ్చీ సంగీతాన్ని అందించగా.. జాహ్రాహ్ ఎస్ ఖాన్, రోమీలతో పాటు జాకీ స్వయంగా దీనిని పాడాడు. ‘‘రకుల్ కోసం రాయించిన ఈ పాట కోసం జాకీ తన ప్రాణం పెట్టాడు. ఇది పెళ్లిలో ముఖ్యమైన ఘట్టం కానుంది. తనకు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ ఐడియాతో ముందుకొచ్చాడు. ఈ పాట వారి ప్రేమకథను సెలబ్రేట్ చేసే విధంగా ఉంటుంది’’ అని జాకీ సన్నిహితులు రివీల్ చేశారు. దీంతో పాటు పెళ్లికి వచ్చిన గెస్టులకు కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్‌లు ఉండనున్నాయి. సీనియర్ నటి శిల్పా శెట్టి.. తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి రకుల్, జాకీల పెళ్లిలో పెర్ఫార్మ్ చేయనున్నట్టు సమాచారం.
సిద్ధి వినాయకుడి దర్శనం..
లక్ష్మి మంచు, ప్రగ్యా జైస్వాల్, అజయ్ దేవగన్.. ఇలా ఎందరో సెలబ్రిటీలు రకుల్, జాకీల పెళ్లిలో సందడి చేయనున్నారు. పెళ్లి పనుల కోసం గోవాకు బయల్దేరే ముందు ముంబాయ్‌లోని సిద్ధి వినాయకుడి ఆలయాన్ని సందర్శించుకుంది ఈ జంట. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. 2021లో ముందుగా వీరి ప్రేమ గురించి బయటపెట్టారు రకుల్, జాకీ. అప్పటినుండి ఇప్పటివరకు వీరు పెద్దగా బయట కలిసి కనిపించకపోయినా.. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను బయటపెడుతూనే ఉన్నారు. గోవాలో జరగనున్న డెస్టినేషన్ వెడ్డింగ్‌లో కొందరు సినీ సెలబ్రిటీలతో పాటు ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు.
Also Read: 'రాయన్'గా ధనుష్, గుండుతో ఫస్ట్ లుక్ అదుర్స్!