Tiragabadara Saami Teaser: బాలయ్య సినిమా టికెట్ల కోసం మర్డర్ చేసినా పర్వాలేదట - ‘తిరగబడరా సామి’ ట్రైలర్ చూశారా?
రాజ్ తరుణ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరా సామీ’. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. భయపడే కుర్రాడు తిరగబడితే ఎలా ఉంటుందో ఇందులో చూపించారు.
రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘తిరగబడరా సామీ’. మాల్వీ మల్హోత్రా, మన్నార్ చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రూపొందుతోంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘తిరగబడరా సామీ’ టీజర్ సోమవారం సోషల్ మీడియాలో విడుదలైంది. ఈ టీజర్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టీజర్ లాంచ్ చేశారు. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.
భయపడే కుర్రాడు కత్తులు పట్టుకుంటే?
చిన్న పిల్లలు తప్పిపోతే వాళ్ళను తల్లితండ్రుల దగ్గరికి చేర్చి సంతోషపడతాడు రాజ్ తరుణ్. భయం చాలా ఎక్కువ. ప్రాణం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాంటి అబ్బాయి ఫైట్లంటే ఇష్టపడే అమ్మాయి (మల్వి మల్హోత్రా) గర్ల్‌ఫ్రెండ్‌గా దొరుకుతుంది. ‘‘బాలయ్య సినిమా టికెట్ల కోసం హత్య చేసినా ఫర్వాలేదు’’ అనే డైలాగుతోనే ఆమె క్యారెక్టర్‌లో పవర్ గంజాయి వనం లాంటి ముఠాని నడిపిస్తున్న లోకల్ డాన్ మకరంద్ దేశ్ పాండే హీరోకి ఓ ప్రమాదరకమైన పని అప్పగిస్తాడు. అసలు వీళ్లిద్దరి ఉన్న సంబంధం ఏంటి? గొడవ అంటేనే భయపడే యువకుడు కత్తులు పట్టుకుని ఎందుకు కుత్తుకలు కొస్తాడు అనేది సినిమా కథ.
సినిమాపై అంచనాలు పెంచిన టీజర్
ఈ సినిమా బ్యాగ్రౌండ్ లో జై బాలయ్య నినాదం, ‘అఖండ’ మ్యూజిక్ కూడా వాడేశారు మేకర్స్. కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తోంది. ఏఎస్ రవికుమార్ చౌదరి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందమైన ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఫన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. చలాకీ కుర్రాడు రాజ్ తరుణ్ పికివాడికి కనిపించడం ఆసక్తికరంగా ఉంది. అతని లవర్ గా నటించిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపించింది. మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రలో కనిపించడం ఆసక్తికరం. మన్నార్ చోప్రా కీలక పాత్ర పోషించింది. ప్రేక్షకులను అలరించేలా ఉన్న ఈ చిత్రం తాజాగా టీజర్ తో అంచనాలు ఓ రేంజిలో పెంచేసుకుంది. చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న రాజ్ తరుణ్ ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు.
ఈ చిత్రంలో రఘుబాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్రి సత్తి నటించారు. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయనప్పటికీ సెప్టెంబర్ లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జవహర్ రెడ్డి ఎంఎన్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, జెబి సంగీతం అందించారు. భాష్యశ్రీ డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి బస్వ పైడి రెడ్డి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు.
Read Also: పేరెంట్స్ కోసం ప్రేమను వదులుకున్నా - తన ఫస్ట్ లవ్ గురించి జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial