రాజమౌళి 'Globe Trotter' మరోసారి ట్రెండింగ్! ఈ పదానికి అర్థమేంటో తెలుసా?
Globe Trotter:మహేష్‌బాబు 50వ జన్మదినం సందర్భంగా స్పెషల్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి సోషల్ మీడియాను షేక్ చేశారు. Globe Trotter గురించి నవంబర్ 2025లో నెవర్ బిఫోర్ సీన్ రివీల్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

Globe Trotter Meaning In Telugu: దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం SSMB29పై బిగ్ అప్‌డేట్ ఇచ్చేశారు. నవంబర్‌లో సర్‌ప్రైజ్ ఉంటుందని రాజమౌళి సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అయితే మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా బిగ్ సర్‌ప్రైజ్ ఉంటుందని ఊహించుకున్న ఫ్యాన్స్‌కు ఇది కాస్త నిరాశపరిచినా రాజమౌళి పెట్టిన ఫొటో మాత్రం మంచి కిక్ ఇస్తోంది. అందులో దర్శక ధీరుడు పేర్కొన్న ఓ వర్డ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. దాని అర్థమేంటీ? ఎక్కడి నుంచి ఈ పదం పుట్టింది లాంటి వివరాల కోసం ఆన్‌లైన్ డిక్షనరీలు తీస్తున్నారు సినిమా ఫ్యాన్స్
'Globe Trotter'అనేది ఇంగ్లీషు భాషలో చాలా ప్రాచుర్యం పొందిన పదం. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తుల గురించి చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతారు. తెలుగులో "ప్రపంచ పర్యటకుడు" లేదా "భూగోళాన్ని చుట్టే వ్యక్తి" అని అర్థం.
"ప్రపంచంలోని వివిధ దేశాల్లో తరచుగా ప్రయాణించే వ్యక్తి" అని విస్తృత అర్థంలో వాడతారు. ఈ పదం కేవలం యాత్రలు చేయడం మాత్రమే కాకుండా, సాహసోపేత మనస్తత్వం, సాంస్కృతిక పరిచయాలను కోరుకునే వ్యక్తిత్వాన్ని కూడా సూచిస్తుంది.
చరిత్ర -మూలాలు
1870 కాలానికి చెందిందీ ఈ పదమే Globe Trotter. ప్రత్యేకంగా రికార్డులు సృష్టించడానికి లేదా అధిక దేశాలను సందర్శించడానికి ప్రయత్నించే వ్యక్తుల గురించి చెప్పే సందర్భంలో వాడటం ప్రారంభించారు. వాస్తవానికి ఈ పదం పారిశ్రామిక విప్లవం తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు సులభతరమైనప్పుడు మరింత ప్రాచుర్యం పొందింది.
Globe Trotter అనేది కేవలం ప్రయాణం చేసే వ్యక్తిని సూచించే పదం మాత్రమే కాదు. ఇది ఒక జీవనశైలిని, మనస్తత్వాన్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే కోరికను ప్రతిబింబిస్తుంది. ఆధునిక యుగంలో టెక్నాలజీ అభివృద్ధితో Globe Trotter అవ్వడం మరింత సులభమైంది.ప్రయాణ రంగం, వ్యాపారం, క్రీడలు, మీడియా రంగాలలో ఈ పదం విస్తృతంగా వాడుకలో ఉంది. క్లాస్ సర్కిల్స్‌లో మాత్రమే వాడుకునే ఈ పదాన్ని ఇప్పుడు రాజమౌళి మాస్ సర్కిల్‌లోకి తీసుకొచ్చారు.
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న SSMB29 సినిమాలో మహేష్‌బాబు ఓ గ్లోబల్ ట్రావెలర్‌గా చూడొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అడ్వెంచర్‌లు రాజమౌళిక స్టైల్‌లో ఉంటాయని, కచ్చితంగా ఇది గ్లోబల్ స్టోరీ అవుతుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. #GlobeTrotterతో రాజమౌళి పోస్టుపెట్టిన వెంటనే సోషల్ మీడియా షేక్ అయ్యింది.
The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025
Globe Trotter అనే పదానికి తగ్గట్టుగానే ఇప్పుడు రిలీజ్ చేసిన లుక్‌లో కొన్ని ఇండికేషన్స్ రాజమౌళి ఇచ్చారు. మీ ఊహకే వదిలేస్తున్నా అన్నట్టు రాజమౌళి ఒక్క ఫొటోతో సినిమా ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్నారు. తాజాగా పోస్టు చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు మెడలో ఓ రుద్రాక్ష మాల ఉంది. దానికి త్రిశూలం, ఢమరుకం, నంది ఉన్నాయి. రుద్రాక్ష శాంతికి ప్రశాంతతకు చిహ్నాంగా చెబుతారు. త్రిశూలం శత్రు సంహారానికి గుర్తుగా పేర్కొంటారు. ఢమరుకం ఆనంద శక్తిని సూచిస్తుంది. నందిని ధైర్యానికి, బలానికి సింబల్‌గా వివరిస్తారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాలంటే కచ్చితంగా నవంబర్ వరకు ఎదురు చూడక తప్పదు. ఇందులో మహేష్ లుక్ ఎలా ఉంటుంది అనేది నవంబర్‌లో రివీల్ చేయనున్నారు రాజమౌళి.





















