News
News
X

Sreeleela Joins NBK 108 : బాలకృష్ణ - శ్రీ లీల - షూటింగ్ చేసేది ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆమె షూటింగులో జాయిన్ కానున్నారు.

FOLLOW US: 
Share:

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) 108వ సినిమా (NBK 108 movie) సినిమా లేటెస్ట్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే... ఇందులో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కూడా జాయిన్ కానున్నారు.
 
తొమ్మిది నుంచి మూడు రోజులు
బాలకృష్ణ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తొలి చిత్రమిది. దీనిని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తారకరత్న మరణం, తదనంతర కార్యక్రమాల కారణంగా షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. అన్ని పనులు పూర్తి కావడంతో ఈ నెల 9న లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. మూడు రోజుల పాటు శ్రీలీల డేట్స్ ఇచ్చారట. బాలకృష్ణ, శ్రీలీల మీద కీలక సన్నివేశాలు తీయడానికి అనిల్ రావిపూడి ప్లాన్ చేశారు. 

బాలకృష్ణ కూతురు కాదు...
సినిమాలో హీరోయినూ కాదు!
బాలకృష్ణకు కుమార్తెగా శ్రీలీల నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదు. సినిమాలో ఆమె హీరోయిన్ అంత కంటే కాదు. కథలో చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అందువల్ల, ఎక్కువ రోజులు డేట్స్ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో డేట్స్ ఇస్తే సరిపోతుంది. 

Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?

దసరాకు ఎన్.బి.కె 108!
బాలకృష్ణ కథానాయకుడిగా వాణిజ్య హంగులతో కూడిన వైవిధ్యమైన కథాంశంతో అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయిక. బాలయ్యకు జోడీగా కనిపించనున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది విజయ దశమికి థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి విజయ దశమి బరిలో మరో సినిమా లేదు.  

బాలకృష్ణతో కాజల్ తొలి చిత్రమిది!
బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో కాజల్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ రెండు మూడు సినిమాలకు పరిశీలనలోకి వచ్చింది. అయితే, ఇప్పటికి కుదిరింది. డిసెంబర్ నెలాఖరులో సినిమా కోసం వేసిన భారీ జైలు సెట్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ ఫైట్స్ తీశారు.

Also Read ఎన్టీఆర్ మనవడి 'బ్రీత్' - డిఫరెంట్ టైటిల్, లుక్‌తో వస్తున్న నందమూరి వారసుడు 

తెలుగు అమ్మాయి, కథానాయిక అంజలి మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్. ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'డిక్టేటర్' చిత్రానికి ఆయన సంగీతం అందించినా... 'అఖండ'తో భారీ విజయం సాధించారు. బాలకృష్ణ, తమన్ కలయికలో 'అఖండ', వీర సింహా రెడ్డి', ఇప్పుడీ సినిమా... హ్యాట్రిక్ అన్నమాట. దీని తర్వాత 'అఖండ 2' కూడా చేయనున్నారు. ఇటీవల ట్విట్టర్ వేదికగా ఎస్.ఎస్. తమన్ 'అఖండ' సీక్వెల్ అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడి సినిమా తర్వాత అఖండ సీక్వెల్ ఉంటుందా? లేదంటే మరో సినిమా చేసిన తర్వాత ఉంటుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. 

Published at : 07 Mar 2023 09:46 AM (IST) Tags: Nandamuri Balakrishna Anil Ravipudi Sreeleela NBK108 Movie

సంబంధిత కథనాలు

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

టాలీవుడ్‌‌లోకి బాలీవుడ్ బ్యూటీలు, తెలుగులో పాగా వేసేదెవరు?

టాలీవుడ్‌‌లోకి బాలీవుడ్ బ్యూటీలు, తెలుగులో పాగా వేసేదెవరు?

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Virupaksha Modhamamba Temple: ‘విరూపాక్ష’ మూవీ కోసం ఏకంగా గుడే కట్టేశారు - ఎంత అద్భుతంగా ఉందో చూడండి

Virupaksha Modhamamba Temple: ‘విరూపాక్ష’ మూవీ కోసం ఏకంగా గుడే కట్టేశారు - ఎంత అద్భుతంగా ఉందో చూడండి

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

టాప్ స్టోరీస్

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం