అన్వేషించండి

Sreeleela: బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే మహేశ్ బాబు, అందుకే దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడేమో - శ్రీలీల

Guntur Kaaram Pre Release Event: ‘గుంటూరు కారం’ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. అందులో హీరోయిన్ శ్రీలీల.. మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించింది.

Sreeleela at Guntur Kaaram Pre Release Event: మహేశ్ బాబు, శ్రీలీల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ జనవరి 12న సంక్రాంతి రేసులో పోటీపడడానికి సిద్ధమయ్యింది. త్రివిక్రమ్, మహేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ కావడంతో ‘గుంటూరు కారం’పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్‌నే పండగలాగా చేసుకున్న ఫ్యాన్స్.. మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేశ్ బాబును తెగ పొగిడేసింది. అంతే కాకుండా మహేశ్ కూడా శ్రీలీల గురించి గొప్పగా మాట్లాడారు. గ్రీన్ శారీలో మెస్మరైజ్ చేసిన శ్రీలీల.. తన స్పీచ్‌తో కూడా ఆకట్టుకుంది.

మాటలు రావడం లేదు..
ముందుగా మహేశ్ బాబు డైలాగ్‌తో స్పీచ్ స్టార్ట్ చేసింది శ్రీలీల. గుంటూరులో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఈ ఈవెంట్‌ను చూడడానికి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. గుంటూరు వస్తే అర్థమవుతోంది అని తన అభిమానుల గురించి మహేశ్ చెప్పారని, ఇప్పుడు వచ్చినందుకు ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమ తనకు గుర్తుండిపోతుందని అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంది శ్రీలీల. ఇంట్రడక్షన్‌తోనే ఫ్యాన్స్‌ను ఐస్ చేసేసింది. ఇక మహేశ్ బాబును చూస్తుంటే మాటలు రావడం లేదని, ఆ విషయం ఆయనకు కూడా తెలుసని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. చాలాసార్లు సెట్స్‌లో మహేశ్‌ను చూస్తూ డైలాగులు కూడా మర్చిపోయానని చెప్పింది. అయినా సరే.. తనను భరించినందుకు థ్యాంక్స్ తెలిపింది.

బాబు బంగారం..
‘గుంటూరు కారం’ మొదటి రోజు షూటింగ్ పూర్తి చేసుకొని శ్రీలీల ఇంటికి వెళ్లగానే అందరూ చుట్టుముట్టేసి మహేశ్ ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు అని ప్రశ్నించడం మొదలుపెట్టారట. అయితే వారితో బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో.. అలా ఉంటారని చెప్పానని బయటపెట్టింది శ్రీలీల. ఆయన మనసు కూడా బంగారమే అని ప్రశంసించింది. ‘‘నిజానికి నేను అక్కడ ఆడియన్స్‌లో ఆయన అభిమానిగా ఉండాల్సిన దాన్ని.. అక్కడ ఉండి విజిల్స్ వేయాల్సిన దాన్ని.. ఇక్కడకు వచ్చి ఇవన్నీచెప్పడానికే దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడేమో అనిపిస్తుంది’’ అంటూ మహేశ్‌తో కలిసి నటించడంపై సంతోషం వ్యక్తం చేసింది శ్రీలీల.

ఇది రీలాంచ్‌లాంటిది..
మహేశ్ బాబును మాత్రమే కాదు త్రివిక్రమ్‌ను కూడా పొగడ్తల్లో ముంచేసింది శ్రీలీల. ముందుగా సెట్‌లో తన అల్లరిని భరించినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంది. తనకు అమ్ము అనే పాత్రను ఇవ్వడం చాలా అదృష్టమని చెప్పింది. అంతే కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలో నటించమే అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. త్రివిక్రమ్ ఎన్నో పుస్తకాలు చదివి.. వాటిని సినిమా రూపంలోనో, పాట రూపంలోనో తీసుకువస్తారని చెప్తూ.. అలాంటిదానిలో భాగమయినందుకు సంతోషం వ్యక్తం చేసింది శ్రీలీల. రాఘవేంద్ర రావు ‘పెళ్లి సందడి’తో తను హీరోయిన్‌గా లాంచ్ అయినా.. ‘గుంటూరు కారం’ తనకు రీలాంచ్‌ లాంటిదని వ్యాఖ్యలు చేసింది. ఈ సంక్రాంతికి మీ అమ్ము మీకు తీపిని పంచుతుంది అని చెప్తూ తన స్పీచ్‌ను ముగించింది.

Also Read: తెలివిగా తప్పించుకున్న శ్రీలీల, తమన్ ఎంతడిగినా కుర్చీ మడత పెట్టలేదు!

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget