అన్వేషించండి

Sreeleela: పుష్ప 2 స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల... అఫీషియల్‌గా ఫస్ట్ లుక్ విడుదల చేసిన టీమ్

Pushpa 2 Item Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా షూటింగ్ చేశారు. ఆ పాటలోని శ్రీ లీల లుక్ నేడు రిలీజ్ చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2: The Rule). ఉత్తమ నటుడిగా బన్నీకి జాతీయ అవార్డు తీసుకు రావడంతో పాటు ఆల్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన 'పుష్ప' సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ఇందులోని స్పెషల్ సాంగ్ మీద కూడా! ఆ సాంగ్ చేసే ఛాన్స్ శ్రీ లీల అందుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆవిడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

కిస్సిక్... డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల!
'పుష్ప 2: ది రూల్' సినిమాలో శ్రీ లీల (Sreeleela In Pushpa 2) ఐటమ్ సాంగ్ చేస్తున్న సంగతి ఆల్రెడీ ఆడియన్స్ అందరికీ తెలుసు. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ఇటీవల ఆ పాటను షూటింగ్ చేశారు. లొకేషన్ నుంచి ఎవరో ఫోటోలు తీసి లీక్ చేసేశారు కూడా. అయితే, ఇవాళ తమ సినిమాలో శ్రీ లీల స్పెషల్ సాంగ్ చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. దాంతో పాటు ఆ పాటలో శ్రీ లీల ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది. అంతే కాదు... ఆమెకు డాన్సింగ్ క్వీన్ అని బిరుదు ఇచ్చింది.

Also Read: బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

రీ రికార్డింగ్ చేస్తున్నట్లు కన్ఫర్మ చేసిన తమన్!
'పుష్ప' విజయంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆ సినిమాలో పాటలతో‌ పాటు ఆయన అందించిన నేపథ్య సంగీతానికి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. 'పుష్ప 2: ది రూల్' సినిమాకు కూడా ఆయన సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ సాంగ్స్ అన్ని ఇచ్చేశారు. అయితే రీ రికార్డింగ్ విషయంలో మాత్రం దేవి శ్రీ ప్రసాద్ ఒక్కరే వర్క్ చేయడం లేదు. మరో ముగ్గురు సంగీత దర్శకులు వచ్చినట్లు టాక్.

Also Read'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' రివ్యూ: నిఖిల్ ఎప్పుడో చేసిన సినిమా - ఇప్పుడు చూసేలా ఉందా?


దేవిశ్రీ తో పాటు ఈ సినిమాకు సంగీత దర్శకులు ఎస్‌ఎస్ తమన్, అజనీష్ లోక్‌నాథ్, సామ్ సియస్ నేపథ్య సంగీతం అందిస్తారని యూనిట్ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ సింగర్ కార్తీక్ నిర్వహించిన రీసెంట్ కాన్సర్ట్‌లో తన కోసం 'పుష్ప 2' వెయిటింగ్ అంటూ తమన్ చెప్పారు. తాను 'పుష్ప 2: ది రూల్'కు పని చేస్తున్న విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేశారు. అయితే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకొన్నారు? అనేది ఇంకా సస్పెన్స్.

అల్లు అర్జున్ సరసన శ్రీ వల్లి పాత్రలో రష్మిక నటిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, నవీన్ చంద్ర, కన్నడ హీరో ధనుంజయ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు వేయడానికి ఏర్పాట్లు జరిగాయి.

Also Readసిటాడెల్ హనీ బన్నీ రివ్యూ: Amazon Prime Video ఓటీటీలో సమంత వెబ్ సిరీస్ - ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?:

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget