By: ABP Desam | Updated at : 29 Jun 2023 03:27 PM (IST)
స్పై(Image Credits: Spy/Twitter)
Spy in US : హీరో నిఖిల్ నటించిన 'స్పై' సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, అమెరికాలో మాత్రం ప్లాన్ ప్రకారం జరగలేదు. దీంతో అక్కడి థియేటర్లలో షోలు రద్దు చేశారు. ‘స్పై’ మూవీ కోసం USలో అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ కంటెంట్ ఆలస్యం కారణంగా చాలా థియేటర్లలో అనుకున్న సమయానికి మూవీని ప్రదర్శించలేకపోయారు. దీంతో షోలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈస్ట్ కోస్ట్‌లోని అనేక ప్రాంతాల్లో 'స్పై' సినిమాను నిలిపివేశారు. సినిమా చూసేందుకు ప్రేక్షకులకు ముందుగానే తీసుకున్న టిక్కెట్లను సైతం వారు వాపసు చేశారు. కొన్ని స్క్రీన్లలో యాజమాన్యం మొదట సెకండాఫ్‌ను ప్రదర్శించింది. ఎర్రర్స్ వల్ల ఫస్ట్ ఆఫ్ ప్లే కాలేదు. దీంతో షోలు రద్దు చేశారు. మరికొన్ని చోట్ల 'స్పై' కంటెంట్ ఆలస్యమవడంతో షోలు రద్దు చేయాల్సి వచ్చిందని తెలిసింది. అయితే సాయంత్రం నుంచి షోలు ప్రదర్శించే అవకాశాలున్నట్లు సమాచారం.
నిఖిల్ హీరోగా తెరకెక్కిన 'స్పై' ఒక యాక్షన్ థ్రిల్లర్. ఈడీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి కె ఈ సినిమాను నిర్మించారు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్‌పాండే, అభినవ్ గోమఠం తదితరులు కూడా కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చగా.. శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
‘కార్తికేయ 2’ మూవీ తర్వాత ఇండియా వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకున్న హీరో నిఖిల్..వరుసగా హెవీ సబ్జెక్ట్ ఉన్న చిత్రాలకు సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా, సినిమాకు మధ్య కాస్త గ్యాప్ తీసుకుంటే మంచిదని భావిస్తున్నానని నిఖిల్ ఇటీవల చెప్పారు. ‘స్పై’ తర్వాత తాను రెండు నెలలు బ్రేక్ తీసుకోబోతున్నట్లు చెప్పారు. అప్పుడే ‘స్వయంభూ’ మూవీకి అవసరమైన వెపన్ ఫైట్స్ ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలిపారు.
‘సినిమాల గురించి పూర్తిగా మర్చిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ‘కార్తికేయ2’ రిలీజ్ నుంచి అంటే ఏడాది నుంచి నా మైండ్ మొత్తం జామ్ అయిపోయింది. అందుకే రెండు నెలలు బ్రేక్ తీసుకుని, ఆ తర్వాత ‘స్వయంభూ’ షూటింగ్ స్టార్ట్ చేస్తా. అలాగే ‘స్వయంభూ’ హెవీ ఫిల్మ్ కాదు. ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. నిజానికి ‘స్పై’ మూవీ పైకి సీరియస్ మూవీలా కనిపిస్తుంది కానీ కామెడీ కూడా చాలా ఉంది’ అని చెప్పారు నిఖిల్.
అయితే ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొకటి ప్రకటించకుండా.. ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుకు ప్రకటించారో కూడా తెలిపారు నిఖల్. జూన్ 1న తన బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలని ప్రొడ్యూసర్స్ భావించారంటూ శ్రీలీలను ఎగ్జాంపుల్‌గా చెప్పారు. రీసెంట్‌గా తన పుట్టిన రోజున ఏకంగా ఎనిమిది సినిమాల పోస్టర్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏదేమైనా అది ప్రొడ్యూసర్స్ నిర్ణయమని చెప్పిన నిఖిల్.. తన సినిమాలన్నీ ఆర్డర్ ప్రకారమే ఉంటాయన్నారు. ‘స్వయంభూ, ది ఇండియా హౌస్, కార్తికేయ 2’.. ఇదే క్రమంలో వస్తాయని స్పష్టం చేశారు.
Read Also : Sreeleela: ఆ సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న 'ధమాకా' బ్యూటీ శ్రీలీల - ఆ సినిమా చేసి ఉంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
The Goat Life Release Date: ఎడారి దేశంలో భారతీయ కూలీ కష్టాలు - మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు రెడీ!
ఫ్రీగా ‘సలార్’ టికెట్లు, ‘కాలింగ్ సహస్ర’కు థియేటర్ల కరువు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...
Allu Arjun: అభిమాని కోసం బన్నీ సెల్ఫీ వీడియో - 30 వేల ఫాలోవర్లు టార్గెట్!
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Best Bikes Under Rs 1 lakh: రూ.లక్షలోపు బెస్ట్ బైకులు - బడ్జెట్ ధరలో డబ్బులకు న్యాయం!
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
/body>