SPY movie collections: ‘స్పై’కి ఓదార్పు - బజ్ లేకున్నా ఇలా బతికిపోయారు!
నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై మరో రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ ఓపెనింగ్స్ తో విడుదలై తాజాగా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ కూడా క్రాస్ చేసి, నిఖిల్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ బ్రేక్ ఈవెన్ సినిమాగా నిలిచింది
Nikhil's Spy : నిఖిల్ హీరోగా, డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పై' మూవీ.. గత గురువారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటించిన ఈ థ్రిల్లర్ సినిమా... 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.28.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ని కూడా సాధించింది. అంతే కాదు నిఖిల్ కెరీర్‌లో ఫాస్టెస్ట్ బ్రేక్ ఈవెన్ సినిమా కావడం విశేషం. అయితే, ఈ మూవీకి ఈ రికార్డే కాస్త ఓదార్పు. ఎందుకంటే.. వసూళ్ల పరంగా ఈ మూవీ వెనుకబడింది. అంచనాలను అందుకోలేకపోయింది. కారణం.. ఈ మూవీతోపాటే రిలీజైన ‘సామజవరగమన’ మూవీకి పాజిటివ్ టాక్ రావడమే. ఆ మూవీ లేకపోయి ఉంటే.. తప్పకుండా నిఖిల్ మూవీకి కాస్త ప్రయారిటీ దక్కేదని తెలుస్తోంది.
'18 పేజెస్', 'కార్తికేయ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నిఖిల్ సిద్ధార్థ్.. ఈ సినిమాతో ఆయన కెరీర్ లో మునుపెన్నడూ లేని రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు. 'స్పై' మొదటి రోజే రూ. 11.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా.. రెండో రోజు నాడు మరో రూ. 4.1 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. దీంతో రిలీజైన తరువాత తొలి 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 15.8 కోట్లు వసూలు చేసి హీరో నిఖిల్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 'స్పై' మూవీకి పబ్లిక్ టాక్ కూడా బాగుండటంతో శని, ఆదివారాల్లో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్సే రావడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా మారింది. 'స్పై' బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయాలంటే దాదాపుగా రూ.22 కోట్లకు పైగా వసూళ్లు చేయాలి. కానీ ఇప్పుడు దాన్ని దాటుకుని విడులైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 5 రోజుల్లో రూ.28.90 కోట్లను వసూలు చేసింది. అయితే, ఇది పాన్ ఇండియా మూవీ. ‘కార్తీకేయ-2’కు వచ్చినంత బజ్ ఈ మూవీకి రాలేదని చెప్పుకోవాలి.
ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్మపై కే రాజశేఖర రెడ్డి నిర్మించిన 'స్పై' మూవీకి కథను కూడా ఆయనే అందించడం మరో విశేషం. ఒక రకంగా ఈ సినిమా నిఖిల్‌కి మాత్రమే కాకుండా ఎడిటర్ కెరీర్ నుంచి డైరెక్టర్ కెరీర్‌కి షిఫ్ట్ అయిన గ్యారీ బీహెచ్‌కి, నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే కథ రాసుకోవడమే కాకుండా ఆ కథపై పట్టును సాధించిన నిర్మాత రాజశేఖర్ రెడ్డికి కూడా సక్సెస్‌ని అందించిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకులు. కాగా స్పై మూవీలో నిఖిల్, ఐశ్వర్యా మీనన్ తో పాటు సన్యా ఠాకూర్, అభినవ్ గోమతం, ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Read Also : Balagam Movie: అద్భుతం, ‘బలగం’ సినిమా సరికొత్త రికార్డు - ఆ లెక్కల్లో అంతర్జాతీయంగా అరుదైన ఘనత!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial