Sonakshi Sinha Wedding: సోనాక్షి, జహీర్ పెళ్లి వేడుకలు మొదలు - మెహందీ ఫంక్షన్ ఫోటో వైరల్
Sonakshi Sinha - Zaheer Iqbal: సోనాక్షి సిన్హా.. జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యింది. తాజాగా వారి మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన మొదటి ఫోటో బయటికొచ్చింది.
Sonakshi Sinha - Zaheer Iqbal Wedding: గత కొన్నేళ్లుగా చాలావరకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఏ హడావిడి లేకుండా, మీడియాకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంటున్నారు. కానీ ఏదో ఒక విధంగా ఈ వార్తలు బయటికొస్తూనే ఉన్నాయి. సోనాక్షి సిన్హా విషయంలో కూడా అదే జరిగింది. సైలెంట్‌గా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది సోనాక్షి. కానీ ఏదో ఒక విధంగా ఈ విషయం బయటికి రావడంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇంతలో ఈ వార్తలు నిజమే అని కన్ఫర్మ్ చేసేలాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది సోనాక్షి, జహీర్ మెహెందీ ఫోటో అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు.
మెహందీ ఫోటోనే..
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్.. జూన్ 23న పెళ్లి చేసుకోనున్నారని ఇప్పటికే వార్తలు అంతటా వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ఇంకా ఈ కపుల్ ముందుకు రాలేదు. సోనాక్షి, జహీర్ ఫ్రెండ్ అయిన జాఫర్ అలీ మున్షీ.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య సోనాక్షి, జహీర్ ఫోటో దిగుతూ కనిపించారు. అంతే కాకుండా దీని బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే అప్పుడే వీరిద్దరి పెళ్లి వేడుకలు ప్రారంభం అయిపోయాయని తెలుస్తోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. ఇది కచ్చితంగా ఈ కపుల్ మెహెందీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోనే అంటూ చర్చలు మొదలుపెట్టారు.
గర్వపడుతున్నాను..
బాలీవుడ్‌లో మరో వార్త కూడా వైరల్ అవుతోంది. సోనాక్షి, జహీర్‌ల పెళ్లి అసలు సోనాక్షి ఫ్యామిలీకి ఇష్టం లేదని కూడా బీ టౌన్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా ముందుకొచ్చారు. ‘‘ఇది ఎవరి జీవితం? నా ఒక్కగానొక్క కూతురు సోనాక్షి జీవితం. తనంటే నాకు చాలా ఇష్టం. తనను చూసి నేనెప్పుడూ గర్వపడుతూనే ఉంటాను. తను నన్ను తన బలంగా చెప్తూ ఉంటుంది. అలాంటిది తన పెళ్లికి నేను ఎందుకు వెళ్లకుండా ఉంటాను, వెళ్లకుండా ఉండాలి? నేను తన బలం మాత్రమే కాదు.. తన కవచాన్ని కూడా. సోనాక్షి, జహీర్ జీవితాంతం కలిసుంటారు. వాళ్లిద్దరూ చాలా బాగుంటారు’’ అని చెప్పుకొచ్చారు.
ఇంట్లోనే పెళ్లి..
ఇక సోనాక్షి, జహీర్‌ల వెడ్డింగ్‌పై వైరల్ అవుతున్న రూమర్స్‌పై కూడా శత్రుఘ్న సిన్హా స్పందించారు. మీ పని మీరు చూసుకోండి అంటూ రూమర్స్ వైరల్ చేస్తున్నవారికి వార్నింగ్ ఇచ్చారు. శత్రుఘ్న సిన్హా క్లోజ్ ఫ్రెండ్ అయిన శశీ రంజన్ కూడా సోనాక్షి పెళ్లి గురించి మాట్లాడారు. ‘‘సోనాక్షి తను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటుంది. ఈ పెళ్లిలో అందరూ పాల్గొంటున్నారు. శత్రుఘ్న సోదరులు కూడా ఈ పెళ్లి కోసమే స్పెషల్‌గా అమెరికా నుండి వస్తున్నారు. జహీర్ ఇక్బాల్ ఇంట్లోనే ఈ పెళ్లి జరగనుంది. ఇది కుటుంబం మొత్తానికి గుర్తుండిపోయే ఈవెంట్’’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ సైతం ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
Also Read: ఆమెతో ఆ సీన్స్ ఎలా చేశానో అనిపించింది - వెంటనే మనీషాకు క్షమాపణలు చెప్పా: సోనాక్షి సిన్హా