Sobhita Dhulipala: సెట్‌లో వంట చేసిన అక్కినేని కోడలు... కామెంట్ చేసిన నాగ చైతన్య - ఏమన్నారో చూశారా?
Sobhita Dhulipala Cooking Photos: అక్కినేని నాగార్జున పెద్ద కోడలు శోభితా ధూళిపాళ తన సోషల్ మీడియా ఖాతాలో వంట చేస్తున్న ఫోటోలు షేర్ చేశారు. వాటి కింద నాగ చైతన్య ఏం కామెంట్ చేశారో తెలుసా?

కింగ్ అక్కినేని నాగార్జున పెద్ద కోడలు, యువ సామ్రాట్ నాగ చైతన్య భార్య, పాన్ ఇండియా యాక్ట్రెస్ శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) చాలా క్యాజువల్ లేడీ. హీరోయిన్ అని అసలు ఫోజులు కొట్టడం లేదు. రియల్ లైఫ్‌లో తాను చేసే పనులను కూడా చూపిస్తున్నారు. లేటెస్టుగా వంట చేస్తున్న ఫోటోలు షేర్ చేశారు.
వంట చేసిన అక్కినేని కోడలు!
అవును... అక్కినేని పెద్ద కోడలు వంట చేశారు. ఇందులో వింత ఏముంది? ఈ రోజుల్లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా వంట చేస్తున్నారు. శోభిత చేయడంలో విశేషం ఏముందని అనుకుంటున్నారా? శోభిత వంట చేసింది ఇంట్లో కాదు! షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌లో! ప్రస్తుతం తాను ఏం చేస్తున్నదీ? ఏ ప్రాజెక్ట్ షూటింగ్ చేస్తున్న సమయంలో వంట చేసిందీ? శోభితా ధూళిపాళ చెప్పలేదు. కానీ వంట చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
View this post on Instagram
భర్త పోస్ట్ కింద చైతూ కామెంట్!
భార్య శోభితా ధూళిపాళ చేసిన పోస్ట్ కింద అక్కినేని నాగ చైతన్య కామెంట్ చేశారు. 'Waiting to get a taste of these skills' అని ఆయన పేర్కొన్నారు. అంటే... భార్య చేతి వంట రుచి చూడటం కోసం ఎదురు చూస్తున్నాని చైతూ చెప్పారన్నమాట. సో, ఇప్పటి వరకు భర్తకు శోభిత వంట చేసి పెట్టలేదని అనుకోవాలి మరి.
Also Read: 'కిష్కిందపురి' ట్రైలర్ రివ్యూ... దెయ్యంలా అనుపమ... భారమంతా బెల్లంకొండ మీదే!

అక్కినేని అందగాడు నాగ చైతన్యలో మంచి షెఫ్ ఉన్నారు. ఆయన ఓ రెస్టారెంట్ రన్ చేయడం మాత్రమే కాదు... ఇంట్లో వంట చేశానని చెప్పిన రోజులు ఉన్నాయి. మరో విషయం... ఆయన డైట్ ఫాలో అవుతారు. భర్త డైట్ ఛాట్ చూసి అందుకు తగ్గట్టు శోభిత ఏం వంట చేసి పెడతారో చూడాలి.సినిమాలకు వస్తే... 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య ఒక మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. శోభిత చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.
Also Read: హీరోయిన్లకు ఏమైంది? తాప్సీ to జ్యోతిక వయా కమలినీ ముఖర్జీ... అవసరం తీరాక టాలీవుడ్ మీద విమర్శలు!?





















