Sobhita Dhulipala and Naga Chaitanya Sankranthi Celebrations : శోభిత, నాగచైతన్య సంక్రాంతి సెలబ్రేషన్స్.. 'విశాఖ క్వీన్' అంటూ భార్యను పొగిడేస్తున్న చై
Sobhita Dhulipala and Naga Chaitanya Sankranthi Photos : అక్కినేని కోడలు శోభిత ధూళిపాల తన సంక్రాంతి సెలబ్రేషన్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.

Sobhita Dhulipala and Naga Chaitanya Sankranthi Celebrations 2025 : నాగ చైతన్య, శోభిత ధూళిపాల సంక్రాంతి 2025 సెలబ్రేషన్స్ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఈ భామ తమ మొహాలు కనిపించకుండా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలిపే విధంగా ఇన్‌స్టాలో స్టోరీలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే చై, శోభితలకు ఈ సంక్రాంతి పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండుగ.
సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో భాగంగా శోభిత భోగిమంటలు, పరమాన్నం, ఆమె మిర్రర్ సెల్ఫీలను స్టోరిగా పెట్టింది. నాగచైతన్యతో కలిసి కేవలం పాదాలు కనిపించేలా ఉన్న ఫోటోను కూడా స్టోరిలో లవ్ సింబల్‌తో హైలైట్ చేసింది. అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం శోభిత, చైతన్య పట్టువస్త్రాలు కట్టుకున్నారు. చైతన్య పంచె కట్టుకుని కుర్తా వేసుకోగా.. శోభిత రెడ్ కలర్ గోల్డెన్ అంచుతో వచ్చిన శారీ కట్టుకుని అందంగా ముస్తాబైంది. మెడలో మంగళసూత్రం, నల్లపూసలు వేసుకుని.. సింపుల్ జ్యూవెలరీతో కనిపించింది. అయితే కాళ్లకు మాత్రం మెట్టెలు పెట్టుకోలేదు.

ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత శోభిత తన మొదటి సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూడండి అంటూ పోస్టులు చేస్తూ షేర్ చేస్తున్నారు. నాగచైతన్య కూడా తమ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. Panduga Vibes with my Visakha Queen అంటూ రాసుకొచ్చారు.
ఇన్‌స్టాలో మొదలైన ప్రేమ
నాగచైతన్య తన డివోర్స్ తర్వాత.. శోభితతో ప్రేమలో ఉన్నాడనే రూమర్స్ బాగా వినిపించాయి. ఆ రూమర్స్‌కి బలం చేకూర్చేలా వీరు ట్రిప్స్‌కి వెళ్లడం చర్చగా మారింది. ఇదిలా ఉండగా.. వారు ఆగస్టు 8, 2024లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అప్పుడే ఈ విషయాన్ని నాగార్జున అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలిపారు. డిసెంబర్ 4, 2024న వీరిద్దరూ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ ఎలా మొదలైందో శోభితా చెప్పింది.
చైతన్య, శోభిత ఇన్‌స్టాలో స్టోరిలకు రిప్లై ఇచ్చుకుంటూ ఫ్రెండ్స్‌గా మారారని.. అనంతరం ఆమెను కలిసేందుకు చై ముంబైకి వచ్చేవాడని చెప్పింది. చాటింగ్ చేయడం ఇష్టంలేక డైరక్ట్ మీట్ అయ్యేవాడని.. అలా వారి మధ్య ప్రేమ చిగురించినట్లు శోభిత తెలిపింది. ఇలా ఇన్‌స్టా ద్వారా మొదలైన వారి స్నేహం.. పెళ్లివరకు వెళ్లింది. పెళ్లి తర్వాత వచ్చిన సంక్రాంతి వారికి తొలి పండుగ కావడంతో వారిద్దరూ పూజలు చేసి.. సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
Also Read : పెళ్లికూతురు నగలు ఎలా ఉండాలో తెలుసా? శోభిత ధూళిపాళను చూసి ఫాలో అయిపోండి






















