News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Skanda Release Date: ‘స్కంద‘ వాయిదా - 'సలార్' విడుదల తేదీకి వెళ్లిన బోయపాటి, రామ్ సినిమా

రామ్ పోతినేని తాజా చిత్రం ‘స్కంద‘ రిలీజ్ డేట్ మారింది. సెప్టెంబర్ 28న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్ల మేకర్స్ అఫీషియల్ ప్రకటించారు. ఎందుకు రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

FOLLOW US: 
Share:

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, క్యూట్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్కంద‘. బోయపాటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా రిలీజ్ చేస్తామని వెల్లడించింది. అయితే, తాజాగా మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేశారు. సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.  చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

View this post on Instagram
 
A post shared by Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)

మాస్ యాక్షన్  సీన్లతో ఆకట్టుకున్న ట్రైలర్

ఇక ఇప్పటికే విడుదలైన  ‘స్కంద‘ ట్రైలర్ యాక్షన్ సీన్లతో అదరిపోయింది. బోయపాటి మాస్ హీరోయిజం ఆకట్టుకుంది.   యాక్షన్ సీన్లు ట్రైలర్ కే హైలైట్ గా నిలిచాయి. ట్రైలర్‌లో రామ్‌ చెప్పే పంచ్‌ డైలాగ్‌లు 'ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే' పటాసుల మాదిరి పేలాయి. రామ్‌ను మాస్‌ లుక్‌లో బోయపాటి చూపించారు.  ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. మొదటి రెండు పాటలను హీరో హీరోయిన్లపై తెరకెక్కించగా,  మూడో పాటలో ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించారు. మొత్తంగా ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి.   

విడుదలకు ముందే రూ. 100 కోట్ల బిజినెస్

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ జోరుగా జరుగుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, నాలుగు భాషలకు సంబంధించిన ‘స్కంద’ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్, దాని అనుబంధ ఛానళ్ళు దక్కించుకున్నాయి. ఇందుకోసం రూ. 54 కోట్లకు డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 'స్కంద' హిందీ ఓటీటీ శాటిలైట్, థియేట్రికల్ హక్కులను రూ. 35 కోట్లకు జీ స్టూడియోస్ తీసుకుంది. ఆడియో రైట్స్ ద్వారా మరో రూ. 9 కోట్లు వచ్చాయని సమాచారం. మొత్తంగా విడుదలకు ముందే రూ. 100 కోట్ల బిజినెస్ జరిగింది.   

స్పెషల్ సాంగ్ తో అలరించనున్న ఊర్వశి రౌతేలా

రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లో  సయీ మంజ్రేకర్ రెండో హీరోయిన్ గా చేస్తోంది.  శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' మూవీని  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి  ర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘స్కంద’ (Skanda Movie) సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also: ప్రభాస్ కు ఛాలెంజ్ విసిరిన అనుష్క- రొయ్యల పులావ్ వండిపెట్టిన పాన్ ఇండియన్ స్టార్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 06 Sep 2023 11:00 AM (IST) Tags: Boyapati Srinu Ram Pothineni Skanda Movie Skanda Release Date

ఇవి కూడా చూడండి

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే

Raveena Tandon: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!

Raveena Tandon: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Ritika Singh: ఆ ఘటన చూసి గుండె మండింది, ఇబ్బంది అనిపించినా అమ్మాయిలకు వాటిని నేర్పించాల్సిందే

Ritika Singh: ఆ ఘటన చూసి గుండె మండింది, ఇబ్బంది అనిపించినా అమ్మాయిలకు వాటిని నేర్పించాల్సిందే

Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!

Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!

టాప్ స్టోరీస్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత