అన్వేషించండి

SJ Suryah: ‘గేమ్ చేంజర్’ని మీరు ఊహించలేరు... అకీరాతో ‘ఖుషి 2’ - ఎస్.జె. సూర్య‌ చెప్పిన ముచ్చట్లు

SJ Suryah Game Changer Interview: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని హత్తుకున్నప్పుడు తెలియని ఆనందం కలిగింది. గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో ఇప్పుడే మీరు ఊహించలేరంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు ఎస్.జె. సూర్య.

SJ Suryah About Game Changer: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా ‘గేమ్ చేంజర్’ వేడుకకు రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నా గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా చెప్పలేని ఆనందం కలిగింది.. నోట మాట కూడా రాలేదు. ఆయన్ను హత్తుకున్నప్పుడు నాకు తెలియని ఆనందం కలిగిందని అన్నారు విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య. ఆయన విలన్‌గా నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం జనవరి 10న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం టీమ్ అంతా ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా నటుడు ఎస్.జె. సూర్య తెలుగు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. 

‘‘మొదటగా నాకు ఈ ‘గేమ్ చేంజర్’ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందంటే.. శంకర్ గారు నన్ను ఈ సినిమా కోసం పిలిచారు. గేమ్ చేంజర్ సెట్‌లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్లాను. నా నటన చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాలో నటనను చూసే నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. ఆయన ప్రతీ ఒక్క పాత్రను నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే చాలు.. స్క్రీన్ మీద మ్యాజిక్‌ అయిపోతుంది. రామ్ చరణ్ అద్భుతమైన నటుడు. ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఆ స్టార్‌లో ఓ గొప్ప నటుడున్నారు. ఈ చిత్రంలో ఆయన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే రామ్ చరణ్‌కు లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ఓ నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ గేమే ఈ గేమ్ చేంజర్‌. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు.. ఎంత బాగా కథనాన్ని శంకర్ గారు రాశారు అన్నది మీరు థియేటర్లోనే చూడాలి. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా మూవీ ‘గేమ్ చేంజర్’.

Also Read: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు

స్వతహాగా నేను దర్శకుడిని అయినా.. ప్లేయర్‌గా ఆడుతున్నప్పుడు ఆట మీద ప్లేయర్‌గానే దృష్టి పెట్టాలి. పక్క చూపులు చూడకూడదు. నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటుడిగానే ఆలోచించాలి. అయినా శంకర్ గారికి సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయా నాది. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారు. ఓ కథను నమ్మి డబ్బులు పెడితే ఇంత బాగా తిరిగి వస్తుందని నమ్మకం కలిగించిందే శంకర్ గారు అని రాజమౌళి సర్ చాలా గొప్ప విషయాన్ని చెప్పారు. ఈ సినిమాలో శంకర్ గారు క్రియేట్ చేసిన ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు నేను పూర్తి సినిమాను చూడలేదు. కానీ కొన్ని రషెస్ చూశాను. రామ్ చరణ్ సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి. ఇవన్నీ కాకుండా.. రీసెంట్‌గానే నేను జరగండి పాటను చూశాను. లిరికల్ వీడియో వచ్చినప్పుడు నేను కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి? అని డల్ అయ్యాను. కానీ ఇటీవల పూర్తి పాటను చూసి షాక్ అయ్యాను. ఈ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయనిపించింది. థియేటర్లో ఈ సాంగ్ బ్లాస్ట్ అవుతుంది. ఓ కాఫీ కప్పులోనే ఊరి సెట్ వేసినట్టుగా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది.

‘గేమ్ చేంజర్’ జర్నీలో నాకు సవాలుగా అనిపించిన అంశం అంటే.. సెట్‌కు వచ్చే ముందే నేను చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. దర్శకుడికి ఏం కావాలి?.. సీన్ ఎలా ఉండాలి? డైలాగ్ ఎలా చెప్పాలి? అనే విషయంలో చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపించింది. నాకు అద్భుతమైన పాత్రను ఇచ్చారు. ఈ పాత్రని నేను చాలా ఎంజాయ్ చేశాను. అందుకే తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాను. నాకు హిందీ అంతగా రాదు.. కానీ డబ్బింగ్ మాత్రం అద్భుతంగా చెప్పాను. నా హిందీ డబ్బింగ్ కోసమైనా మీరంతా రెండో సారి హిందీలో సినిమా చూడాలని అనుకుంటారు. మళ్లీ దర్శకత్వం ఎప్పుడు, ఖుషి 2 అకీరాతో చేస్తారా? అని అంతా అడుతున్నారు. ప్రస్తుతం నాకు నటుడిగా చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఆలోచించను. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ గారిలానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒకవేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. అలాగే టైమ్ కలిసి వస్తే.. మాత్రం ఖుషి 2 ఉంటుందేమో చెప్పలేను.

చాలా రోజుల తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గారు మా ఈవెంట్‌కు రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నా గురించి మాట్లాడుతూ ఉంటే.. నిజంగా నాకు చెప్పలేని ఆనందం కలిగింది. అసలు నోట మాట రాలేదు. ఆయనని హత్తుకున్నప్పుడు నాకు తెలియని ఆనందం కలిగింది. ‘ఖుషి’ టైమ్‌లో ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అప్పుడాయన ఐడియాలజీ గురించి చెబుతుంటే నాకు అర్థమయ్యేది కాదు. కానీ, ఇప్పుడు ఆయన ఐడియాలజీ అందరికీ తెలుస్తోంది. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. నిజాయితీగా కష్టపడే వారిని ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు.

Also Read: అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

నిర్మాత దిల్ రాజు‌గారి గురించి చెప్పాలి. నిజంగా ఆయన ఆల్ రౌండర్. కేవలం డబ్బులు పెట్టి సినిమాలు తీసే వాళ్లని నిర్మాత అని చెప్పలేం. దిల్ రాజు‌గారు సెట్‌కు వస్తారు. అన్ని క్రాఫ్ట్‌లను పరిశీలిస్తారు. షూటింగ్ ఆగకుండా అప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కరిస్తారు. ఆయనకు కథల మీద మంచి పట్టుంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. అందుకే దిల్ రాజు ఆల్ రౌండర్ అన్నాను. ఆయన ఈ సినిమాకు చాలా ఖర్చు పెట్టారు. ఒక్క ‘జరగండి’ పాటకే  కోట్లు పెట్టారు. ఆ సాంగ్ ఎలా ఉండబోతోందో థియేటర్లో మీకే తెలుస్తుంది. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. నిజంగా అన్‌ప్రీడక్టబుల్ అనేలా సినిమా ఉంటుంది. అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి’’ అని ఎస్.జె. సూర్య చెప్పుకొచ్చారు. కాగా,  శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా ఈ సినిమాను నిర్మించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget