అన్వేషించండి

Sivakarthikeyan: శివకార్తికేయన్ - మురుగదాస్ సినిమాకు 'జైలర్' టచ్?

Sivakarthikeyan Ar Murugadoss Movie : శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. ఆ సినిమాకు 'జైలర్' టచ్ ఇవ్వబోతున్నట్లు కోలీవుడ్ టాక్. 

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా అంటే ఒకప్పుడు ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ నెలకొనేది. అటువంటి దర్శకుడు ఒక్కసారిగా కనుమరుగు అయిపోయారు. తమిళ అగ్ర హీరోలతో సినిమాలు చేసిన ఆయన... సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ తీసిన తర్వాత మరో సినిమా చేయలేదు. కరోనా కూడా దర్శకుడిగా ఆయన విరామానికి ఓ కారణమని చెప్పాలి. మూడేళ్ల విరామం తర్వాత మురుగదాస్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.

శివ కార్తికేయన్ సినిమాలో మోహన్ లాల్?
యువ తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కలయికలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి జైలర్ టచ్ ఇవ్వనున్నట్లు కోలీవుడ్ టాక్.

Mohanlal In Sivakarthikeyan Movie : శివ కార్తికేయన్ సినిమాలో ఓ ప్రధాన పాత్రకు మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ అయితే బాగుంటుందని ఏఆర్ మురుగదాస్ భావిస్తున్నారట. అంతేకాదు ఇటీవల మలయాళ హీరోని కలిసి కథ, అందులో ఆయన పాత్ర గురించి పూర్తిగా వివరించారట! కీలక పాత్రలు చేయడానికి మోహన్ లాల్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఏడాది రజనీకాంత్ జైలర్ సినిమాలో ఆయన చేసిన పాత్రకు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది‌. దాంతో శివ కార్తికేయన్ సినిమాలో మరో స్పెషల్ క్యారెక్టర్ అనే సరికి తమిళనాట క్రేజ్ నెలకొంది.

మురుగదాస్ తుపాకీ టచ్ కూడా ఇస్తున్నారా?
Vidyut Jamwal In Sivakarthikeyan Movie : మోహన్ లాల్ మాత్రమే కాదు... శివ కార్తికేయన్ సినిమాలో మరో ప్రధాన పాత్రకు బాలీవుడ్ కథానాయకుడు విద్యుత్ జమాల్ పేరు కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ మురుగదాస్ దర్శకత్వంలో నటించిన అనుభవం ఆయనకు ఉంది. దళపతి విజయ్ హీరోగా మురుగదాస్ తీసిన తుపాకీ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశారు విద్యుత్ జమాల్. సో... మురుగదాస్ అడిగితే కాదని అనరు. 

Also Read : 'యానిమల్'కు పోటీగా మాజీ ప్రేయసి భర్త సినిమా - డిసెంబర్ 1న భలే క్లాష్!

శివ కార్తికేయన్ జోడిగా మృణాల్ ఠాకూర్?
శివ కార్తికేయన్ 23వ చిత్రం ఇది. ఇందులో కథానాయకగా మృణాల్ ఠాగూర్ పేరు వినపడుతోంది. సీతారామన్ సినిమాతో తెలుగు నాట మృణాల్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న', రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమాలలో నటించే అవకాశాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో తమిళనాడులో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

Also Read 50 రూపాయలకు 'మంగళవారం' సినిమా - ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు చూశారా?

శివ కార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget