దసరా కంటే ముందే 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ - నిర్మాత నాగవంశీ
మహేష్ బాబు 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగ వంశీ. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ని దసరాకి ముందే అనౌన్స్ చేస్తామని చెప్పారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం'(Guntur karam) ఫస్ట్ సింగల్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగ వంశీ. రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో 'దసరాకి గుంటూరు కారం ఫస్ట్ సింగిల్' రిలీజ్ చేస్తామని చెప్పిన ఆయన తాజా ఇంటర్వ్యూలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి అప్డేట్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటివరకు సినిమా నుంచి టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు. ఆ టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో 'గుంటూరు కారం' ఫస్ట్ సాంగ్ రిలీజ్ గురించి నిర్మాత నాగ వంశీ మరోసారి అప్డేట్ ఇచ్చారు. 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను దసరా రోజున లేకపోతే అంతకంటే ముందే ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Producer @vamsi84 About Guntur Kaaram First Single 🕺🕺🥳🥳🔥🔥#GunturKaaram @urstrulyMahesh pic.twitter.com/YbQxmbkRQz
— Pandu Gadu 2.0 (@PanduGadu2_0) October 17, 2023
" గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ని దసరా టైంకి అనౌన్స్ చేస్తాం. దసరా టైం కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి చాలా ఎర్లీగా సాంగ్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ సాంగ్ అంతా రెడీ అయిపోయింది? దసరా టైం కి డేట్ చెప్తాం" అంటూ నాగ వంశీ అన్నారు. అంటే మరో వారం రోజుల్లోనే 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అనౌన్స్మెంట్ తర్వాత అతి త్వరగా పాట రిలీజ్ ఉంటుందని ఆయన చెప్పడంతో ఈ అప్డేట్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో హాజరైన ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
'అతడు', 'ఖలేజా' వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లోనూ మరింత ఆసక్తి నెలకొంది. ఇందులో మహేష్ ని ఊర మాస్ పాత్రలో చూపించబోతున్నారు త్రివిక్రమ్. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిజానికి ఈ మూవీలో మహేష్ సరసన మొదట పూజా హెగ్డే ని తీసుకున్నారు. కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ కూడా జరిగింది.
కానీ ఎందుకో తెలియదు అర్ధాంతరంగా పూజ హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో సెకండ్ హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసిన శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మానందం సైతం కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ఏ దర్శకుడైనా మా నాన్నగారితో సమానం, నీ ప్రశ్నకు నా ఇగో హర్ట్ అయ్యింది: అనిల్‌పై అలిగిన బాలయ్య
Join Us on Telegram: https://t.me/abpdesamofficial