Aadikeshava Trailer: ‘ఆదికేశవ’ ట్రైలర్ - ఇలా చేస్తారనుకోలేదు!
వైష్ణవ్ తేజ్ అప్‌కమింగ్ చిత్రం ‘ఆదికేశవ’ ట్రైలర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ చివరి నిమిషంలో మూవీ టీమ్ అసలు విషయాన్ని బయటపెట్టింది.
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా పరిచయమయిన చాలామంది ప్రస్తుతం టాలీవుడ్‌ను ఏలేస్తున్నారు. ‘ఉప్పెన’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా మెల్లగా ఈ రేసులోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘ఉప్పెన’ తర్వాత వైష్ణవ్‌కు మంచి హిట్ లేదు. దీంతో ‘ఆదికేశవ్’ మూవీపై ఈ యంగ్ హీరో చాలా ఆశలు పెట్టుకున్నాడు. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కావల్సి ఉంది. దీంతో మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, చివరి క్షణంలో ట్రైలర్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్
వైష్ణవ్ తేజ్ హీరోగా అడుగుపెట్టి రెండు సంవత్సరాలు అయ్యింది. ఈ రెండేళ్లలో మూడు సినిమాలలో తను హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అందులో తన డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. తన అన్న సాయి ధరమ్ తేజ్ కెరీర్ మొత్తంలో ఏ సినిమాకు సాధించలేని కలెక్షన్స్‌ను ఉప్పెనతో సాధించి చూపించాడు వైష్ణవ్. దీంతో అన్నకు పోటీగా తమ్ముడు ఇండస్ట్రీకి వచ్చాడని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాపుల వల్ల వైష్ణవ్ కెరీర్ స్లో అయ్యింది. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఆదికేశవ’పైనే ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అనుకున్న వైష్ణవ్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
మీడియా మిత్రులకు క్షమాపణలు
’ఆదికేశవ’ ట్రైలర్ నవంబర్ 17న విడుదల చేస్తామని ఈ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. నవంబర్ 24న మూవీ విడుదలకు సిద్ధమవుతుండడంతో ఇప్పటికే పాటలతో ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది మూవీ టీమ్. ఇక ట్రైలర్ కూడా విడుదల చేసి ప్రమోషన్‌ను వేగవంతం చేయాలని భావించింది. కానీ ఇంతలోనే ట్రైలర్ విడుదల చేయలేమంటూ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్రకటించింది. ‘‘సాంకేతిక సమస్య కారణంగా ‘ఆదికేశవ’ ట్రైలర్ పోస్ట్‌పోన్ చేయవలసి వచ్చింది. చివరి నిమిషంలో క్యాన్సెస్ చేసినందుకు మీడియా మిత్రులకు, ఫ్యాన్స్‌కు క్షమాపణలు’’ అని సితార ఎంటర్‌టైన్మెంట్స్ తాజా ట్వీట్‌లో తెలిపింది. ఇక ‘ఆదికేశవ’ ట్రైలర్‌కు కొత్తగా ముహూర్తం ఎప్పుడు ఖరారు చేశారు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.
Due to a technical issue, we are forced to postpone the release of our #AadikeshavaTrailer!
— Sithara Entertainments (@SitharaEnts) November 17, 2023
We apologize to all our media friends and fans for this last-minute cancellation and for the inconvenience caused! 😓#Aadikeshava 💥
శ్రీలీలతో పాటు మరో ముద్దుగుమ్మ
‘ఆదికేశవ’ చిత్రాన్ని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాకు హైప్ క్రియేట్ తీసుకురావడం కోసం ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న శ్రీలీలను లీడ్ రోల్‌కు ఎంపిక చేసింది మూవీ టీమ్. తనతో పాటు అపర్ణ దాస్ కూడా ఇందులో మరో హీరోయిన్‌గా కనిపించనుంది. మలయాళంలో ఎన్నో సినిమాలతో సీనియర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న జోజూ జార్జ్‌ను ‘ఆదికేశవ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఇప్పటికే శ్రీలీల, వైష్ణవ్ తేజ కలిసి జీవీ ప్రకాశ్ ట్యూన్స్‌కు వేసిన స్టెప్పులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని శ్రీలీల ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఎదురుచూడడం మొదలుపెట్టారు.
Also Read: రాజకీయాల్లోకి దర్శకుడు అనిల్ రావిపూడి - త్వరలోనే కొత్త పార్టీ కూడా?