అన్వేషించండి

Simhadri: ‘సింహాద్రి’ రీ-రిలీజ్ కలెక్షన్స్ అన్నీ వారికే - ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద మనసు

డైరెక్టర్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో 2003లో వచ్చిన 'సింహాద్రి' సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ రీరిలీజ్ కానుంది.

Simhadri : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో 2003లో రిలీజైన 'సింహాద్రి' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇప్పుడు మరోసారి థియేటర్లలో కనువిందు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ కానుండగా ఆయన ఫ్యాన్స్ ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీ ద్వారా వచ్చే కలెక్షన్ లన్నీ నిరుపేద ఫ్యాన్స్ కు అందజేయనున్నారని 'ఎన్టీఆర్ ఆల్ ఇండియా ఫ్యాన్స్' ఓ ప్రకటనలో తెలిపారు.

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతూ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఖుషి', 'తమ్ముడు', 'జల్సా', ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన 'పోకిరి', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' రీరిలీజ్ అయ్యి మరోసారి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'దేశ ముదురు' కూడా మరోసారి థియేటర్లలో విడుదలవడంతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. మరికొన్ని సినిమాలైతే.. వాటికొస్తున్న ఆదరణ, కలెక్షన్లను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ స్ర్కీనింగ్ కూడా వేస్తున్నారు. అలాంటి వాటిలో 'ఖుషి', 'ఆరెంజ్' సినిమాలు నిలిచాయి.

ఇక రీరిలీజ్ అయిన సినిమాలకు వచ్చిన కలెక్షన్లతో మరోసారి మేకర్స్ ఎంజాయ్ చేస్తుంటే.. కొన్ని సినిమాలను మళ్లీ విడుదల చేయడం ద్వారా వచ్చే అమౌంట్ ను పేదవారికి లేదా ఏదైనా పార్టీకి విరాళంగా ఇవ్వాలని మరికొందరు ప్లాన్ చేస్తున్నారు. అదే తరహాలో ఇంతకుముందు రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' సినిమాను రీరిలీజ్ చేయడం ద్వారా వచ్చిన కలెక్షన్లను పవన్ కళ్యాణ్ 'జనసేన పార్టీ'కి ఇవ్వాలని నిర్ణయించినట్టు మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. ఈ మూవీ రీరిలీజ్ అయ్యి రూ.3 కోట్లకి పైగా కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం. ఇలా రీరిలీజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఏదో ఒక పనికి లేదా సంస్థకు డొనేట్ చేయడం ఈ రోజుల్లో ట్రెండింగ్ గా మారిపోయింది.

ఇప్పుడు అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్, భూమిక నటించిన 'సింహాద్రి' సినిమా తారక్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న రీరిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించి 4కె డిజిటల్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాని కొనుగోలు చేసి రీరిలీజ్ చేస్తుండడం చెప్పుకోదగిన విషయం. ఇదిలా ఉండగా ఈ సినిమా రీరిలీజ్ పై తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ ప్రెస్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ద్వారా కలెక్షన్లను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ అభిమానులకు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కి కూడా చెప్పామని, ఆయన కూడా తమకు మద్దతు తెలిపినట్టు ప్రకటనలో తెలియజేశారు. అంతే కాదు ఇంత మంచి పని చేస్తున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ తమని అభినందించారని వారు ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. 

'సింహాద్రి' రీరిలీజ్ కలెక్షన్లు ఏ ఒక్కరి స్వలాభం కోసం కాదని అఖిల భారత ఎన్టీఆర్ అభిమానులు ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా మరోసారి స్పష్టం చేశారు. సింహాద్రిలో భూమిక, అంకిత కథానాయికలుగా నటించారు. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. 

Read Also: ఓటీటీలో విడుదలకు ‘కబ్జా’ రెడీ- ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget