మే 20న 'సింహాద్రి' రీరిలీజ్ - కలెక్షన్స్ ఏం చేయబోతున్నారంటే!
జూనియర్ ఎన్టీఆర్ ఆల్ టైం ఇండస్ట్రీ 'సింహాద్రి' మే 20న రీరిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ లోని లాభాలను ఓ మంచి పని కోసం ఉపయోగించబోతున్నారట మేకర్స్.

ప్రస్తుతం మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటి స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ ల రూపంలో మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. అలా ఇప్పటికే పలువురు అగ్ర హీరోల సినిమాలు రీ రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం రీ రిలీజ్ ల విషయంలో ఓ సంచలన రికార్డును క్రియేట్ చేశాడు. ఎన్టీఆర్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయిన 'సింహాద్రి' మూవీ మే 20న రీరిలీజ్ కాబోతుంది. 20 సంవత్సరాల క్రితం వచ్చిన 'సింహాద్రి' రీ రిలీజ్ కి 1000 షోలు ఉండడం.. దానికి తోడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇప్పటివరకు ఓ రీ రిలీజ్ సినిమాకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ రికార్డ్ కేవలం ఎన్టీఆర్ 'సింహాద్రి' మూవీకి మాత్రమే దక్కడం విశేషం.
ఇక సింహాద్రి మూవీ ని 4k, డాల్బీ, అట్మాస్ వెర్షన్ లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనే సుమారు 150 కి పైగా థియేటర్స్ లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ అయిన మెల్ బోర్న్ ఐమాక్స్ థియేటర్ లోనూ సింహాద్రి రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ లోని లాభాలను ఓ మంచి పని కోసం ఉపయోగించాలని భావిస్తున్నారట మేకర్స్.అందుతున్న సమాచారం ప్రకారం పేదరికంతో బాధపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా కలెక్షన్స్ ద్వారా వచ్చిన డబ్బుని పంచేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ సూచించిన అభిమానులకు ఈ సాయం అందబోతోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అంకిత, భూమిక హీరోయిన్స్ గా నటించగా.. నాజర్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, భానుచందర్ తదితరులు ఇతర కీలకపాత్ర పోషించారు. 2023 లో విడుదలైన ఈ సినిమా సుమారు 30 కోట్లకు పైగా వసూలు చేసి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ మూవీగా నిలిచింది అంతేకాదు. ఆ సంవత్సరం టాలీవుడ్ లోనే మోస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు రీ రిలీజ్ లోను 'సింహాద్రి' మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు అభిమానులు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్ను సైతం యూట్యూబ్ లో విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ కూడా ఇప్పుడు మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ముఖ్యంగా ట్రైలర్ లో ఎక్కువగా యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ని హైలెట్ చేసి కట్ చేశారు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరాటాల శివ దర్శకత్వంలో 'ఎన్టీఆర్ 30' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానుంది.
Also Read: రూలంటే రూలే - అమితాబ్, అనుష్కలకు ముంబై పోలీసులు జరిమానా!రూలంటే రూలే - అమితాబ్, అనుష్కలకు ముంబై పోలీసులు జరిమానా!





















