News
News
వీడియోలు ఆటలు
X

Samantha - Siddhu Jonnalagadda : హీరోగా సిద్ధూ ఫిక్స్ - సమంత ఫ్రెండ్ ఏమంటోందంటే?

సమంత, సిద్ధూ జొన్నలగడ్డ జోడీగా ఓ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. ఆ సినిమా గురించి సమంత ఫ్రెండ్ ఏమంటున్నారో తెలుసా?

FOLLOW US: 
Share:

ఇప్పుడు సమంత (Samantha) ఏం చేస్తున్నారు? అంటే విజయ్ దేవరకొండకు జోడీగా 'ఖుషి' సినిమా చేస్తున్నారు. హిందీ హీరో వరుణ్ ధావన్ జోడీగా 'సిటాడెల్' వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? అంటే... సిద్ధూ జొన్నలగడ్డ పేరు వినబడుతోంది! అసలు వివరాల్లోకి వెళితే...

హీరోగా సిద్ధూ అయితే ఫిక్స్! కానీ... 
సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కథానాయకుడిగా దర్శకురాలు నందినీ రెడ్డి ఓ సినిమా చేయనున్నారు. అందులో సమంత కథానాయికగా, కీలకమైన పాత్ర చేయనున్నారు. రామ్ తాళ్ళూరి ఈ చిత్రానికి నిర్మాత. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమంతకు సన్నహితులైన వ్యక్తుల్లో నందినీ రెడ్డి ఒకరు. 

నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన తొలి సినిమా 'జబర్దస్త్'. అది ఆశించిన విజయం సాధించలేదు. అయితే, ఆ సినిమాతో వాళ్ళ మధ్య స్నేహం బలపడింది. ఆ తర్వాత చేసిన 'ఓ బేబీ' సూపర్ హిట్ అయ్యింది. ముచ్చటగా మూడోసారి వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తున్నారు. 

సంతోష్ శోభన్. మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన  'అన్నీ మంచి శకునములే' విడుదలకు రెడీగా ఉంది. థియేటర్లలోకి గురువారం సినిమా వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో నందినీ రెడ్డి మాట్లాడారు. అప్పుడు సమంత, సిద్ధూ జొన్నలగడ్డ సినిమా గురించి ప్రశ్నించగా... ''నా తదుపరి సినిమాలో హీరోగా సిద్ధు ఫిక్స్! సమంతను అనుకోలేదు'' అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు సమంత పేరు ప్రకటించడం ఎర్లీ అవుతుందని అనుకున్నారేమో!?

ఆల్రెడీ చేసిన దర్శకులతో... 
ఇప్పుడు సమంత చేస్తున్న ప్రాజెక్టులను గమనిస్తే... ఆల్రెడీ పని చేసిన దర్శకులతో మళ్ళీ పని చేస్తున్నారు. 'ఖుషి' దర్శకుడు శివ నిర్వాణతో ఇంతకు ముందు 'మజిలీ' చేశారు. 'సిటాడెల్' వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకేతో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' చేస్తున్నారు. నందినీ రెడ్డితో కూడా గతంలో పని చేశారు. 

Also Read తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?

సమంత వ్యక్తిగత జీవితానికి వస్తే... నాగ చైతన్యతో విడాకుల తర్వాత సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేశారు. అయితే, విడాకుల తర్వాత చైతూను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. శోభితా ధూళిపాళతో చైతూ డేటింగ్ చేయడం మీద కూడా కామెంట్స్ చేశారు. ఎంత మందితో డేటింగ్ చేసినప్పటికీ... ప్రేమకు విలువ ఇవ్వని వాళ్ళకు చివరకు కన్నీళ్లు మిగులుతాయని, ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తే తనకేంటి? అని సమంత చెప్పినట్లు ఓ మీడియా వార్త రాయగా... ''నేను ఎప్పుడూ చెప్పలేదు'' అని సామ్ పేర్కొన్నారు.  

నేను ఏ తప్పూ చేయలేదు! - సమంత
''విడాకులు తీసుకున్నాం. కానీ, నేను ఏమీ తప్పుగా చేయలేదు. నా వైపు నుంచి వంద శాతం కృషి చేశా. వైవాహిక బంధానికి కట్టుబడి ఉన్నాను'' అని సమంత పేర్కొన్నారు. తాను తప్పు చేయలేదని సమంత చెప్పడంలో అర్థం ఏమిటి? చైతన్య తప్పు చేశాడని చెబుతున్నారా? రెండు లైన్లలో ఎన్నో అనుమానాలు, ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలేశారు. సమంత కామెంట్స్ వల్ల నాగ చైతన్య బ్యాడ్ అవుతున్నాడని అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Also Read పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!

Published at : 17 May 2023 04:15 PM (IST) Tags: Tollywood Latest Updates New Movie Siddhu Jonnalagadda Samantha Nandini Reddy

సంబంధిత కథనాలు

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !