సంతోష్ శోభన్‌కు హిట్ పడి చాలా రోజులైంది. అయినా 'అన్నీ మంచి శకునములే'కు బజ్ ఏర్పడింది. మరి, బిజినెస్ ఎలా జరిగింది? అంటే... 

సినిమా బడ్జెట్ రూ. 20 కోట్లు అట. భారీ తారాగణం, సాంకేతిక వర్గం ఉండటంతో ఖర్చు ఎక్కువే అయ్యిందట. 

నిర్మాతలకు హ్యాపీ మూమెంట్ ఏంటంటే... డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా రూ. 21.5 కోట్లు వచ్చాయట.

'అన్నీ మంచి శకునములే' విడుదలకు ముందు నిర్మాతలు లాభాల్లో ఉన్నారు. దాంతో ఓ రిస్క్ చేస్తున్నారు.

సినిమాను సొంతంగా విడుదల చేస్తున్నారు. ఎవరికీ అమ్మలేదు. దాంతో ఏరియాల పరంగా లెక్కలు బయటకు రాలేదు. 

'అన్నీ మంచి శకునములే' థియేట్రికల్ బిజినెస్ వేల్యూ రూ. 5 కోట్లుగా లెక్క కట్టారట. ఐదున్నర కోట్ల షేర్ వేస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లు!

'మహానటి', 'సీతా రామం', 'జాతి రత్నాలు' తీసిన స్వప్న సినిమాస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావచ్చు.  

నందిని రెడ్డి డైరెక్షన్ కూడా ఉండటంతో 'అన్నీ మంచి శకునములే'కు టాక్ వస్తే ఐదున్నర కోట్లు రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. 

'అన్నీ మంచి శకునములే' సినిమాను స్వప్న సినిమాస్, మిత్రవిందా మూవీస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించారు.