Takkar Trailer: రొమాంటిక్ యాక్షన్ మూవీతో వస్తున్న సిద్థార్థ్ - థ్రిల్ చేస్తున్న ‘టక్కర్’ ట్రైలర్!
సిద్థార్థ్ హీరోగా నటిస్తున్న ‘టక్కర్’ ట్రైలర్ విడుదల అయింది.
Takkar Trailer: ఒకప్పుడు తెలుగులో మంచి స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన హీరో సిద్థార్థ్. అయితే క్రమంగా వరుస ఫ్లాపులతో తన స్టార్‌డం పడిపోయింది. 2021లో ‘మహాసముద్రం’తో రీ-ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకు కావాల్సిన సక్సెస్ దొరకలేదు. ఇప్పుడు ‘టక్కర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల వరుస సినిమాలతో మంచి ఫాంలో ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదల చేశారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే... రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రానుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తుంది. కథను మాత్రం పెద్దగా రివీల్ చేయలేదు. సిద్థార్, హీరోయిన్ దివ్యాంశు కౌశిక్‌ల మధ్య ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. ఒక లిప్ లాక్ సీన్ కూడా ట్రైలర్‌లో చూపించారు. తమిళ కమెడియన్ యోగిబాబు డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు.
Happy to launch the Trailer of #Takkar for my producers @peoplemediafcy
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 21, 2023
Very Intriguing & Entertaining https://t.co/xS6G3Kequ4
All the best #Siddharth bro,@Karthik_G_Krish @itsdivyanshak @AAArtsOfficial @PassionStudios_ @nivaskprasanna @editorgowtham and the whole team. pic.twitter.com/gPdl4GtSqO
Happy to share #Takkar Trailer - https://t.co/0VbOAbZVw7
— VijaySethupathi (@VijaySethuOffl) May 21, 2023
Congrats team.
Directed by @Karthik_G_Krish
🌟#Siddharth #TakkarFromJun9@PassionStudios_ @iYogiBabu @itsdivyanshak @nivaskprasanna @editorgowtham @Sudhans2017 @thinkmusicindia @jayaram_gj @DoneChannel1 pic.twitter.com/3fwU9gx7mZ
Elated to release the super exciting #Takkar Trailer - https://t.co/vntGhy4Gp9
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) May 21, 2023
Good & interesting 👍
Best wishes team !!
Directed by @Karthik_G_Krish
🌟#Siddharth #TakkarFromJun9@PassionStudios_ @iYogiBabu @itsdivyanshak @nivaskprasanna @editorgowtham @Sudhans2017… pic.twitter.com/SCgSeWc1Vx
హీరోయిన్ దివ్యాంశ కౌశిక్‌కు ‘మజిలీ’ తర్వాత సరైన హిట్ రాలేదు. రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’, సందీప్ కిషన్ ‘మైఖేల్’ వంటి సినిమాల్లో నటించినా.. అమ్మడుకి అంతగా కలసి రాలేదు. అందుకే ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచి ఈసారి ‘టక్కర్’ తో టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. ఈ మూవీలో బోల్డ్ సీన్లే కాదు.. బోల్డ్ డైలాగులు కూడా బోలెడన్ని ఉన్నాయి. మరి ఈ సినిమాతో దివ్యాంశకు ఎలాంటి హిట్ అందుతుందో చూడాలి.
హీరో సిద్దార్థ్ కు కూడా ఈ సినిమా హిట్ కావడం ఎంతో అవసరం. గత కొన్నాళ్లుగా సిద్దార్థ్ సినిమాలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అందుకే తన రాబోయే సినిమాలపై ఆశలన్నీ పెట్టుకున్నారు సిద్ధార్థ్. ఈ సినిమాతో పాటు దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘ఇండియన్ 2’ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ టీమ్ సిద్దార్ధ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్దార్థ్ ఈ సినిమాలో నటిస్తున్నారని తెలియగానే ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ‘టక్కర్’ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు, మునీశ్ కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్ తదితరులు కనిపించనున్నారు. నివాస్ కె ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, టీ.జీ. విశ్వప్రసాద్ పేషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మించారు. ఈ మూవీను మే 26 న తెలుగులో రిలీజ్ చేయనున్నారు.