అన్వేషించండి

Bommarillu: అంతేనా... అంటూ మరోసారి థియేటర్లో సందడి చేయబోతున్న జెనీలియా, సిద్ధార్థ్‌ - 'బొమ్మరిల్లు' రీ రిలీజ్‌, ఎప్పుడంటే!

Bommarillu Movie Re Release: ఎవర్‌ గ్రీన్‌ లవ్‌స్టోరీ బొమ్మరిల్లు మరోసారి థియేటర్‌లో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను రి రిలీజ్‌ చేయబోతున్నట్టు తాజాగా నిర్మాత దిల్‌ రాజు టీం ప్రకటన ఇచ్చింది. 

Bommarillu Movie Re Release Date Announced: "అంతేనా.. కుదిరితే కప్‌ కాఫీ, వీలైయితే నాలుగు మాటలు" యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకుంది ఈ డైలాగ్‌. ఈ ఒక్క డైలాగ్‌తో జెన్నిలియా కుర్రాళ్ల గుండెల్లో కూడుకట్టుకుంది. అబ్బాయి కలల రాకుమారి అయిపోయింది. ప్రియురాలు అంటే ఇలా ఉండాలని అప్పట్లో ప్రతి ఒక్కరి డ్రీమ్‌ గర్ల్‌గా అయిపోయింది జెన్నిలియా. హీరో సిద్ధార్థ్‌ని అయితే అమ్మాయిల కలల రాకుమారుడిని చేసింది ఈ సినిమా. అదే 'బొమ్మరిల్లు'. ఫ్యామిలీ అండ్‌ లవ్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. ఈ సినిమాలోని ప్రతి డైలాగ్స్‌ ఎవర్‌ గ్రీన్‌ అనే చెప్పాలి. 

ఎవర్ గ్రీన్ 'బొమ్మరిల్లు'

అంతేనా.. అంటూ జెనిలియా కుర్రకారు మనసు దొచేస్తే.. ఇంకేం కావాలంటూ అమాయకంగా అడిగి లవర్‌ బాయ్‌ అయిపోయాడు సిద్దు. యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా 2006లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. లవ్‌, ఎమోషన్స్‌, ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంది ఈ సినిమా. ప్రేమకథగా యూత్‌రి, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కట్టేలే చేసింది. 2006 ఆగస్ట్‌ 9న థియేటర్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఈ మూవీ వచ్చి ఇప్పటికీ 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌గా అదే క్రేజ్‌ను కొనసాగిస్తుంది.

ఆ రోజున థియేటర్ లో సందడి

ఈ సినిమాలో డైలాగ్స్‌ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నానే ఉంటాయి. అంతేకాదు పలు సినిమాల్లోనూ బొమ్మరిల్లు డైలాగ్స్‌ని వాడేస్తున్నారు. అంతగా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఈ బొమ్మరిల్లు మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు దిల్‌ రాజ్‌ నిర్మాణ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్‌ 21న బొమ్మరిల్లును రిరిలీజ్‌ చేయబోతున్నట్టు తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ తమ ఎక్స్‌లో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ అప్‌డేట్‌ చూసి యూత్‌ అంతా పండగ చేసుకుంటుంది. ఈ వింటేజ్‌ లవ్‌ స్టోరీని మరోసారి థియేటర్లో చూసేందుకు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు.

"ఎప్పటికీ చెరిగిపోని సినిమా. ఆ ఆనందాన్ని పంచడానికి వచేస్తున్నాం. కుదిరితే కప్ కాఫీ SEPTEMBER 21st మళ్ళి  థియేటర్స్‌లో" అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ప్రకటన ఇచ్చింది. కాగా ఈ సినిమా సాధించిన విజయం, యూత్‌లో తెచ్చుకున్న క్రేజ్‌తో ఏకంగా డైరెక్టర్‌ ఈ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. హీరో సిద్ధార్థ్‌, జెన్నిలియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, సురేఖ వాణి, సునీల్‌ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.  

Also Read: సందీప్‌ రెడ్డి వంగాతో 'దేవర' టీం ముచ్చట్లు - జాన్వీపై కొరటాల ఆసక్తికర కామెంట్స్‌! అదిరిపోయిన ప్రొమో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Telangana News: సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Telangana News: సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Embed widget