అన్వేషించండి

Shruti Haasan: సీక్రెట్‌గా శృతి హాసన్ పెళ్లి? అతడి కామెంట్స్‌తో సందేహాలు, స్పందించిన ‘సలార్’ బ్యూటీ

‘సలార్’ బ్యూటీ శృతి హాసన్ గత కొంతకాలంగా ఆర్టిస్ట్ షాంతను హజారికాతో రిలేషన్‌షిప్‌లో ఉందని తెలిసిన విషయమే. కానీ వీరిద్దరికీ సీక్రెట్‌గా పెళ్లి కూడా అయిపోయిందని వార్తలు రావడంతో శృతి స్పందించింది.

మామూలుగా సినీ పరిశ్రమల్లో ఇద్దరు నటీనటులు సన్నిహితంగా కనిపిస్తే.. వారి రిలేషన్‌షిప్‌పై రూమర్స్ మొదలవుతాయి. కొంతమంది ఆ రూమర్స్‌పై క్లారిటీ ఇస్తే.. మరికొందరు మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ శృతి హాసన్ అలా కాదు.. తన పర్సనల్ లైఫ్ గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఏదీ ఎక్కువగా దాచకుండా తన బాయ్‌ఫ్రెండ్ గురించి, రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెట్టేసింది శృతి. కానీ తాజాగా శృతికి పెళ్లి అయిపోయిందని, ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్‌గా తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుందని రూమర్స్ మొదలయ్యాయి. ఈ రూమర్స్‌పై శృతితో పాటు తన బాయ్‌ఫ్రెండ్ షాంతను కూడా చాలా ఘాటుగా స్పందించాడు.

ఓర్రీ చేసిన ట్వీట్‌తో దుమారం

‘సలార్’ బ్యూటీ శృతి హాసన్, ఆర్టిస్ట్ షాంతను హజారికా డేటింగ్‌లో ఉన్నారని తెలిసిన విషయమే. ఇప్పటికే తమ ప్రేమ గురించి, డేటింగ్ గురించి పలుమార్లు ఓపెన్‌గా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శృతి. అంతే కాకుండా ఎప్పటికప్పుడు వీరి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. పలుమార్లు ఈవెంట్లకు కూడా వీరిద్దరూ కలిసే వెళ్లారు. ప్రస్తుతం వీరి డేటింగ్ గురించి శృతి హాసన్ పెద్దగా ఏ విషయం దాచిపెట్టలేదు. కానీ పెళ్లి గురించి దాచిందని, షాంతనును ఎప్పుడో పెళ్లి చేసుకున్నా బయటపెట్టడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ అన్నీ బాలీవుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ చేసిన ఒక ట్వీట్‌తో మొదలయ్యాయి.

శృతి భర్త షాంతను..

ఒక పార్టీలో శృతి హాసన్‌ను కలిశానని, అప్పటికీ తమకు పరిచయం లేకపోయినా శృతి.. తనతో చాలా దురుసుగా ప్రవర్తించిందని ఓర్రీ తెలిపాడు. అంతే కాకుండా తన భర్త షాంతను మాత్రం బాగానే మాట్లాడాడు కానీ శృతి ప్రవర్తన తనకు నచ్చలేదని అన్నాడు. షాంతనును భర్త అని అనడంతో శృతి, షాంతను ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసేసుకున్నారేమో అంటూ ఇండస్ట్రీలో అనుమానాలు మొదలయ్యాయి. ఫ్యాన్స్ కూడా ఇదే నిజం అనుకొని ఆ ప్రశ్నలతో వారిని విసిగించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన శృతి, షాంతను.. తమ పెళ్లి విషయంపై క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియాలో స్టోరీలతో క్లారిటీ ఇచ్చారు.

ఎందుకు దాచిపెడతాను?

‘‘నేను పెళ్లి చేసుకోలేదు. ప్రతీ చిన్న విషయం గురించి అందరితో షేర్ చేసుకునే నేను.. ఈ విషయం గురించి ఎందుకు దాచిపెడతాను? అందుకే నా గురించి అస్సలు తెలియని వారు కొంచెం శాంతించండి’’ అంటూ తన స్టోరీలో షేర్ చేసింది శృతి హాసన్. పెళ్లి విషయంపై షాంతను కూడా ఇలాంటి స్టోరీనే షేర్ చేశాడు. ‘‘మీరందరూ శాంతించాలి. మేము పెళ్లి చేసుకోలేదు. మా గురించి తెలియని వారంతా రూమర్స్‌ను వ్యాప్తి చేయడం ఆపండి’’ అని రిక్వెస్ట్ చేశాడు. గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో వీరిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటూ ఎన్నోసార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ పెళ్లి ఆల్రెడీ అయిపోయింది అని రూమర్స్ వైరల్ అవ్వడం వీరికి నచ్చలేదు. ఒకవేళ పెళ్లికి సిద్ధమయితే తామే ఓపెన్‌గా ప్రకటిస్తామని శృతి, షాంతను తెలిపారు.

Also Read: ‘ఓజీ’ యాక్షన్ సినిమా కాదు - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన శ్రియా రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Crime News: పెళ్లంటే కొంత మంది మరణశిక్ష - భార్య వేధింపులతో చనిపోయిన సుభాష్ గురించి తెలిస్తే కన్నీళ్లాగవు !
పెళ్లంటే కొంత మంది మరణశిక్ష - భార్య వేధింపులతో చనిపోయిన సుభాష్ గురించి తెలిస్తే కన్నీళ్లాగవు !
Rajendra Prasad: వాడెవడో చందనం దుంగల దొంగ... వాడు హీరో - రాజేంద్రుడి మాటలకు అర్థమేంటి? 
వాడెవడో చందనం దుంగల దొంగ... వాడు హీరో - రాజేంద్రుడి మాటలకు అర్థమేంటి? 
Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Rashmi Gautham: ఇమ్మాన్యుయేల్ బట్టతలపై రష్మి గౌతమ్ జోకులు... శ్రీదేవీ డ్రామా కంపెనీలో అలా చేశారేంటి?
ఇమ్మాన్యుయేల్ బట్టతలపై రష్మి గౌతమ్ జోకులు... శ్రీదేవీ డ్రామా కంపెనీలో అలా చేశారేంటి?
Embed widget