అన్వేషించండి

Shruti Haasan : లక్కీ లేడీ అయిపోయిన శృతి హాసన్! గోల్డెన్ లెగ్ అంటూ నెటిజన్ల ప్రశంసలు!

Shruti Haasan Movies : కొందరు హీరోయిన్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటే వారికి గోల్డెన్ లెగ్ అని పేరు పెట్టేస్తారు. ప్రస్తుతం శృతి హాసన్‌కు కూడా అదే బిరుదు ఇచ్చారు.

Salaar Beauty Shruti Haasan : ఒక సినిమా అంటే అందులో ఎంతోమంది కష్టం ఉంటుంది. కానీ ఒకవేళ ఒక హీరోయిన్ చేస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అయితే.. వేంటనే తనకు ఇండస్ట్రీ అంతా గోల్డెన్ లెగ్ అని బిరుదు ఇచ్చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది గోల్డెన్ లెగ్ హీరోయిన్స్ ఉన్నారు. అందులో లేటెస్ట్‌గా ఎక్కువగా వినిపిస్తున్న పేరు శృతిహాసన్. రీసెంట్‌గా శృతి నటించిన ‘సలార్’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అంతే కాకుండా కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డులను బ్రేక్ చేస్తోంది. ‘సలార్’కంటే ముందు ప్రభాస్‌కు హిట్లు లేవు. అలాగే హిట్లు లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు అందుకున్న ఎంతోమంది హీరోలు శృతి హాసన్‌తో జోడీకట్టినప్పుడే కమ్‌బ్యాక్ ఇచ్చారు. శృతి ఫ్యాన్స్.. ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు.

వరుస ఫ్లాపుల తర్వాత హిట్..
‘అనగనగా ఒక ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది శృతి. ఆ తర్వాత తను నటించిన పలు చిత్రాలు ఫ్లాపులనే అందుకున్నాయి. ఫైనల్‌గా 2012లో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘గబ్బర్ సింగ్‌’తోనే శృతి.. తన మొదటి సక్సెస్‌ను అందుకుంది. ‘గబ్బర్ సింగ్’కు ముందు పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అరడజను సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. శృతి హాసన్‌తో జోడీకట్టగానే ఇద్దరికీ ఒకే సినిమాతో హిట్ వచ్చిందని ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ‘గబ్బర్ సింగ్’తో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన శృతికి బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలు వచ్చాయి. అలా చాలా తెలుగు సినిమాల్లో నటించింది. తన కెరీర్ ఫార్మ్‌లో ఉండగానే మూడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది శృతి.

చాలాకాలం గ్యాప్ తర్వాత..

రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’తో మళ్లీ చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపించింది శృతి హాసన్. ‘రాజా ది గ్రేట్’ తర్వాత వరుస ఫ్లాపులు అందుకున్న రవితేజకు ‘క్రాక్’తోనే మళ్లీ హిట్ లభించింది. దీంతో చాలాకాలం తర్వాత రవితేజకు శృతి హిట్ ఇచ్చిందని ప్రేక్షకులు అనుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కమ్‌బ్యాక్ ఇచ్చిన ‘రేసుగుర్రం’లో, చిరంజీవి కమ్‌బ్యాక్ ఇచ్చిన ‘వాల్తేరు వీరయ్య’లో కూడా శృతినే హీరోయిన్‌గా నటించింది. దీంతో ఎవరైనా హీరో కమ్‌బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే శృతిని హీరోయిన్‌గా పెట్టుకోవాలి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ విషయంలో కూడా అదే జరిగింది

కమ్‌బ్యాక్ హీరోయిన్..

‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్‌కు ఆ తర్వాత నటించిన మూడు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’పైనే ఉన్నాయి. అందరూ ఆశించినట్టుగానే ‘సలార్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ప్రభాస్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇందులో కూడా శృతినే హీరోయిన్‌గా నటించడంతో శృతికి కమ్‌బ్యాక్ హీరోయిన్, గోల్డెన్ లెగ్ బ్యూటీ అంటూ బిరుదులు ఇచ్చేస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫ్లాపులతో బాధపడుతున్న హీరోలతో జతకట్టి వారికి కూడా హిట్లు ఇవ్వమని జోకులు వేస్తున్నారు. గోల్డెన్ లెగ్ అని పేరు రావడంతో మేకర్స్ కూడా సీనియర్ హీరోల సినిమాలకు శృతినే హీరోయిన్‌గా తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read: ఆ సమయంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా - షాకింగ్ విషయాలు బయటపెట్టిన 'యానిమల్' బ్యూటీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Nellore News: పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
Embed widget