అన్వేషించండి

Tripti Dimri Interview : ఆ సమయంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా - షాకింగ్ విషయాలు బయటపెట్టిన 'యానిమల్' బ్యూటీ!

Tripti Dimri : యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి తాజా ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది.

Actress Tripti Dimri Latest Interview : బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. యానిమల్ లో సైడ్ హీరోయిన్ గా నటించిన ఈమె మెయిన్ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది. కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్ తో యూత్ ని కట్టి పడేసింది. దాంతో ఈ ముద్దుగుమ్మకి ఒక్కసారిగా భారీ పాపులారిటీ వచ్చేసింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన రష్మికకి కూడా రాని గుర్తింపు యానిమల్ తో సొంతం చేసుకుంది తృప్తి. ఇప్పుడు బాలీవుడ్ లో ఎలాంటి ఈవెంట్ జరిగినా ఆమెనే పిలుస్తున్నారు.

అంతేకాదు గత నెలలో గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీస్ లో ఈమె కూడా ఒకరు. ఆ రేంజ్ లో త్రిప్తి యానిమల్ తో భారీ ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ నేషనల్ క్రష్ గా మారింది. అటు సోషల్ మీడియాలోనూ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో యానిమల్ కు ముందు 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఈమెకి యానిమల్ రిలీజ్ తర్వాత 45 లక్షల మేర ఫాలోవర్స్ పెరిగారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంత తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ రావడం ఎలా అనిపిస్తుందని అడిగితే కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది త్రిప్తి దిమ్రి. ఆమె మాట్లాడుతూ..

"యానిమల్ రిలీజ్ తర్వాత నిద్ర లేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయిన తర్వాత నాకు సోషల్ మీడియాలో సినిమా నుంచి అనేక మెసేజ్ లు, కాల్స్ రాత్రి పగలు అనే తేడా లేకుండా నాన్ స్టాప్ గా వచ్చేవి. అందుకే నాకు ఇన్ని రోజులు కూడా అసలు నిద్ర అనేది సరిగ్గా లేదు" అంటూ చెప్పుకొచ్చింది. దీంతో తృప్తి దిమ్రి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఒక్క సినిమాతో భారీ ఫేమ్ అందుకున్న తృప్తి ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఈమె కొన్ని ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినట్లుగా సమాచారం. ఇక టాలీవుడ్ లోనూ కొన్ని బడా ప్రాజెక్టులో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇక యానిమల్ విషయానికొస్తే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా రూపొందింది. సినిమాలో రణ్ బీర్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. అనిల్ కపూర్ తండ్రి పాత్రలో కనిపించగా, బాబీ డియోల్ విలన్ గా అదరగొట్టాడు. బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి మరో కీలక పాత్రలో నటించి మెప్పించింది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్ధన్ రామేశ్వర్ తదితరులు సంగీతాన్ని అందించారు.

Also Read : నెగెటివిటీయే నయా ట్రెండ్, సందీప్ రెడ్డి సక్సెస్ మంత్ర ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Embed widget