అన్వేషించండి

Shobu Yarlagadda: సినీ ప్రేమికుల గుడ్ న్యూస్, ఒకే హీరోతో రెండు కొత్త సినిమాలు ప్రకటించిన ‘బాహుబలి’ నిర్మాత

ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ.. సినీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. తమ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించబోయే రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

Shobu Yarlagadda New Movie: ‘బాహుమలి‘ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత శోభు యార్లగడ్డ. ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ ద్వారా మరో రెండు సినిమాలను నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మూవీ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఒకటి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‘ కాగా, మరొక మూవీ ‘ఆక్సీజన్‘. ఈ రెండు పోస్టర్లను షేర్ చేస్తూ శోభు పలు కీలక విషయాలు వెల్లడించారు.

రెండు సినిమాలను ప్రకటించిన శోభు యార్లగడ్డ

తమ నిర్మించబోయే రెండు చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని కలిగించడంతో పాటు చక్కటి వ్యక్తులను సినిమా పరిశ్రమకు పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు శోభు యార్లగడ్డ. “మేము ఈ రెండు చిత్రాలను ప్రకటించినప్పుడు మా మదిలో చాలా ఆలోచనలు వచ్చాయి. మల్టీ టాలెంటెడ్ ఫాహద్ ఫాసిల్ తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. రెండో ప్రాజెక్ట్ ‘ఆక్సీజన్’ కూడా చాలా అద్భుతమైనది. ఈ రెండు సినిమాల ద్వారా ఇద్దరు ప్రతిభావంతులైన దర్శకుడు శశాంక్, సిద్ధార్థని పరిచయం చేస్తున్నాం. అంతేకాదు, ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయతో కలిసి ఈ సినిమాల్లో భాగస్వామిగా ఉండబోతున్నాను. ఈ కలయిక సుదీర్ఘ ప్రయాణానికి నాందిగా భావిస్తున్నాను” అని శోభు యార్లగడ్డ వెల్లడించారు. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

రెండు సినిమాలు- నాలుగు భాషల్లో విడుదల

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా త్వరలో షూటింగ్ మొలుకానున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా షూటింగ్ మొదలు కానుంది. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు కన్నడలో తెరకెక్కనున్న ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు ‘ఆక్సిజన్’ సినిమాకు సిద్దార్థ నాదెళ్ల కథను అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కూడా నాలుగు సౌత్ భాషల్లో తెరకెక్కనుంది. శోభు, ప్రసాద్, కార్తికేయ నిర్మాతలుగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు వేద వ్యాస్ గొట్టిపాటి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. నిరంజన్ దేవరమనే ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన నటీనటులతో పాటు ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ఈ రెండు సినిమాలపై ప్రేక్షకలలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.  

Read Also: హై యాక్షన్‌లో జాన్ అబ్రహం, అమాయక పాత్రలో తమన్నా- ఆకట్టుకుంటున్న ‘వేదా‘ టీజర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Embed widget